అందరూ అనుకుంటున్నదే నిజమని తేలింది. సూర్య సినిమా ‘ఎస్-3’ డిసెంబరు 16 నుంచి 23కు వాయిదా పడటానికి ‘ధృవ’నే కారణమని అధికారికంగా వెల్లడైంది. స్వయంగా హీరో సూర్యనే ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు తెలుగులో లైఫ్ ఇచ్చిన అల్లు అరవింద్ కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నట్లు సూర్య తెలిపాడు. హైదరాబాద్ లో జరిగిన ‘ఎస్-3’ ప్రెస్ మీట్లో సూర్య ఈ విషయాన్ని వెల్లడించాడు.
నన్ను తెలుగులో నన్ను లాంచ్ చేసింది అల్లు అరవింద్ గారు. గజిని సినిమాను ఆయన రిలీజ్ చేయడం వల్ల నాకు తెలుగులో గొప్ప లాంచింగ్ దక్కింది. అందుకే ఆయన నిర్మాణంలో రూపొందిన ‘ధృవ’ సినిమా కోసం మా చిత్రాన్ని వాయిదా వేసుకున్నాం. రెండు సినిమాలకు వారం గ్యాప్ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో మా సినిమాను వాయిదా వేశాం. ‘ధృవ’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని సూర్య తెలిపాడు.
ఇక ‘ఎస్-3’ విశేషాల గురించి సూర్య చెబుతూ.. ‘‘నా కజిన్ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సంస్థను ప్రారంభించి పదేళ్లయింది. ఇలాంటి టైంలో ‘ఎస్-3’ వస్తోంది. హరితో నాకు ఇది ఐదో సినిమా. హారిస్ జైరాజ్ తో ఎనిమిదో సినిమా. నరసింహం క్యారెక్టర్లో మరోసారి బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. అసలు ‘సింగం’ చేసేటపుడు.. సింగం-2.. సింగం-3 చేస్తామని అనుకోలేదు. ఐతే అభిమానులు.. శ్రేయోభిలాషులు అందరూ ఎస్-3 చేస్తే బాగుంటుంది అనడం... హరి మంచి పాయింట్స్ చెప్పడంతో సీక్వెల్స్ చేశాం. ఈ సినిమా బెంగళూరు నేపథ్యంలో సాగినా.. 90 శాతం విశాఖపట్నంలోనే షూటింగ్ జరుగుతుంది. నా లాస్ట్ మూవీ ‘24’కు తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణను మరచిపోలేను. ‘ఎస్-3’ చిత్రాన్ని గ్రాండ్ ప్రమోషన్లతో పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తున్ను నిర్మాత శివకుమార్ గారికి ధన్యవాదాలు’’ అని సూర్య చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/