సూర్య సినిమాకు కొత్త కష్టాలు

Update: 2017-01-07 09:41 GMT
సూర్య గత కొన్నేళ్లలో నటించిన ఏ సినిమాకూ రానంత హైప్ వచ్చింది ‘సింగం’ సీక్వెల్ ‘ఎస్-3’కి. రెండు భాషల్లో కలిపి ఈ సినిమాకు రూ.100 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు అంచనా. తెలుగు హక్కుల కోసం నిర్మాత మాల్కాపురం శివకుమార్ ఏకంగా రూ.18 కోట్లు పెట్టడాన్ని బట్టి ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఒకప్పుడు.

కానీ సినిమాను ఒకటికి రెండుసార్లు వాయిదా వేయడం వల్ల హైప్ నెమ్మదిగా తగ్గిపోయింది. రెండోసారి వాయిదా వేసినపుడు మరీ నెల రోజులకు పైగా సినిమాను ఆపేయడం బాగా నెగెటివ్ అయింది. వడ్డీలు నష్టపోతుండటంతో తెలుగు వెర్షన్ ప్రొడ్యూసర్ తన డబ్బులు వెనక్కిచ్చేసి సినిమాను తీసేసుకోవాలని డిమాండ్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. అప్పటికి ఎలాగోలా పరిస్థితి సద్దుమణిగేలా చేశారు కానీ.. ఇప్పుడు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నట్లు సమాచారం.

సినిమాపై హైప్ కొంత వరకు తగ్గడం.. పైగా జనవరి 26న ‘గురు’ సినిమాకు పోటీగా సినిమాను రిలీజ్ చేస్తుండటం.. తమపై వడ్డీల భారం కూడా పడ్డందుకు బయ్యర్లు ముందు అనుకున్న ప్రకారం డబ్బులు కట్టడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో శివకుమార్ మీద ఒత్తిడి పెరిగి పాత ఒప్పందాన్ని మార్చి.. రేటు తగ్గించాలని అడుగుతున్నాడట. మరోవైపు తమిళంలో కూడా బయ్యర్ల నుంచి నిర్మాత జ్నానవేల్ రాజాకు తలనొప్పలు తప్పట్లేదని సమాచారం. మొత్తానికి అంతా బాగున్నపుడు సినిమాను విడుదల చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేయడం వల్ల ‘ఎస్-3’ పెద్ద దెబ్బే తగిలేట్లుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News