గత కొన్ని నెలలుగా బిగ్ స్టార్స్ కు సంబంధించిన అప్ డేట్స్, ఫస్ట్ లుక్, లాంచింగ్ వంటి క్రేజీ న్యూస్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇందులో కొన్ని సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతూ అభిమానులు సహనాన్ని పరీక్షిస్తున్న ప్రాజెక్ట్ లు కూడా వున్నాయి. అంతే కాకుండా భారీ మైథలాజికల్ డ్రామాకు సంబందించిన ఫస్ట్ లుక్ కోసం కూడా దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా వైడ్ గా గత ఏడాది సంచలనం సృష్టించిన సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న సినిమా కూడా వుంది. ఇవన్నింటికి అప్ డేట్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఆ టైమ్ రాబోతోంది. ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరదించుతూ ఫ్యాన్స్ ని మేకర్స్ అండ్ స్టార్ హీరోస్ అక్టోబర్ ప్రారంభం నుంచి వన్ బై వన్ సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఆగస్టులో సీతారమం, బింబిసార, కార్తికేయ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ లుగా నిలవడంతో టాలీవుడ్ లో మళ్లీ కొత్త జోష్ మొదలైంది. ఈ మూడు సినిమాలు అందించిన ధైర్యంతో వరుసగా చిన్న హీరోలు బాక్సాఫీస్ పై దండయాత్రకు దిగారు.
మధ్యలో శర్వానంద్ నటించిన 'ఒకే ఒక జీవితం' ప్రశంసల్ని దక్కించుకున్నా రిటర్న్స్ లో మాత్రం టాక్ ని బట్టి వసూళ్లని రాబట్టలేకపోయింది. ఇక ఆ తరువాత థియేటర్లలో సందడి చేసిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేక అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో డబ్బింగ్ సినిమాల సందడి మొదలవుతున్నా తెలుగు సినిమాలు.. అందులో సీనియర్ స్టార్ ల సినిమాలు లేకుండే బాక్సాఫీస్ వద్ద ఆ మజా వుండదు.
అందుకే దసరా నుంచి సీనియర్ హీరోల సందడి ప్రారంభం కాబోతోంది. ఆక్టోబర్ 5న మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' తో బరితోకి దిగుతుంటే కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' తో దసరా ఫైట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వీరిద్దరి మధ్యలో మంచు విష్ణు 'జిన్నా', బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' పోటీపడుతున్నాయి. ఇదే సమయంలో కొత్త సినిమాల సందడి మొదలు కాబోతోంది. ఇంత వరక ఫస్ట్ లుక్ అంటూ లేని 'ఆది పురుష్' ఫస్ట్ లుక్, టీజర్ లని అక్టోబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ డ్రామా ఇది.
అంతే కాకుండా ఇదే నెలలో చాలా రోజులుగా ప్రారంభానికి సిద్ధంగా వుండి వరుసగా వాయిదా పడుతూ వస్తున్న అల్లు అర్జున్ 'పుష్ప 2' అక్టోబర్ 1న అల్లు స్టూడియోస్ లో భారీ స్థాయిలో లాంఛనంగా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్ కూడా అక్టోబర్ లోనే పట్టాలెక్కనున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ విషయంలో తర్జన భర్జన పడుతున్న దర్శకుడు ఫైనల్ గా స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ కు వినిపించడం, తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట.
దీంతో ఈ మూవీ అక్టోబర్ లో పట్టాలెక్కడం ఖాయం అని తెలుస్తోంది. ఇక వీటితో పాటు త్రివిక్రమ్ - మహేష్ ల మూవీ, పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' కూడా తదుపరి షెడ్యూల్ అక్టోబర్ లోనే ప్రారంభం కానుందని తెలిసింది. ఇవి నిజంగా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ న్యూస్ లే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.