సూర్య 40వ సినిమా లేటెస్ట్ అప్డేట్..!

Update: 2021-06-08 05:36 GMT
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేయబడిన ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రీ లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొదటి పోస్టర్ లో సూర్య తుపాకీ పట్టుకుని కనిపిస్తే.. రెండో పోస్టర్ లో కత్తి పట్టుకుని మాస్ అప్పీయరెన్స్ ఇచ్చారు. అయితే నిన్న సోమవారం దర్శకుడు పాండిరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు వెల్లడించారు.

'Suriya40' సినిమా షూటింగ్ ఇప్పటికి 35 శాతం కంప్లీట్ అయిందని తెలిపారు. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతేకాదు జూలై నెలలో సినిమా టైటిల్ ప్రకటన ఉంటుందని హింట్ ఇచ్చారు. సూర్య కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. టైటిల్ ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై 'Suriya40' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో స‌త్య‌రాజ్‌ - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - సుబ్బు పంచు - దేవదర్శిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాకీ ఆర్ట్ డైరెక్టర్‌ గా పని చేస్తుండగా.. ఫైట్ మాస్టర్స్ అన్బు - అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

పాండిరాజ్‌ గతంలో సూర్య తో ‘పసంగ 2’(మేము) సినిమాని రూపొందించారు. అలానే కార్తీ తో 'చినబాబు' సినిమా చేశాడు. ఈ క్రమంలో ఇప్పుడు సూర్య తో మరో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు పాండిరాజ్. ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న సూర్య కు.. తన 40వ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News