తమిళ్ మెగా బ్రదర్స్ గా పేరు దక్కించుకున్న సూర్య మరియు కార్తి లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేది ఎప్పుడో కాని వారిద్దరు కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నా కూడా అభిమానులకు కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటుంది.
మన మెగా బ్రదర్స్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఒకే స్టేజీ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో తమిళ్ ప్రేక్షకుల్లో కూడా సూర్య.. కార్తి కనిపిస్తే అలాగే ఉంటుంది.
ఈ తమిళ్ సాంబార్ బ్రదర్స్ తాజాగా విరుమాన్ సినిమా యొక్క ఆడియో వేడుకలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారిద్దరు కూడా తమిళ్ సాంప్రదాయ డ్రెస్ అయిన ప్లెయిన్ షర్ట్ మరియు వైట్ లుంగీ లో కనిపించారు. ఈ బ్రదర్స్ ఇద్దరిని కూడా ట్రెడీషనల్ లుక్ లో కూడా అభిమానులతో పాటు మీడియా వారు అలా చూస్తూనే ఉండి పోయారు అన్నట్లుగా స్టిల్స్ ఉన్నాయి.
కార్తి నటించిన విరుమాన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూర్య పాల్గొన్నాడు. ఆ సమయంలో సూర్య అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సూర్య ను ఆహ్వానించారు. ఆ తర్వాత రోలెక్స్... రోలెక్స్ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ సూర్య పై తమ అభిమానం ను చాటుకున్నారు.
ఇక సూర్య ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ నా కంటే కూడా కార్తి బెస్ట్ యాక్టర్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. కార్తి యాక్టింగ్ అంటే తనకు ఇష్టం అని.. తమ్ముడు కార్తికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.
ఈ సాంబార్ బ్రదర్స్ ఒకరిపై ఒకరు ప్రశంసలు చేసుకున్నారు. వీరు ఇద్దరు కూడా తెలుగులో కూడా మంచి పాపులారిటీని దక్కించుకున్న విషయం తెల్సిందే.