సూర్య తెలుగు మూవీ మాసా క్లాసా ఎవ‌రితో?

Update: 2021-06-20 00:30 GMT
త‌మిళ స్టార్ హీరో సూర్య `సింగం` సిరీస్ లో న‌టించే క్ర‌మంలోనే తెలుగు మీడియాతో ముచ్చ‌టిస్తూ త‌న‌కు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేసే అవ‌కాశాలు ల‌భించాయ‌ని కానీ తాను త‌మిళంలో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌ న‌టించ‌లేక‌పోయాన‌ని తెలిపారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే తెలుగు సినిమా చేస్తాన‌ని కూడా అన్నారు. య‌ముడు 2 (సింగం 2) రిలీజ్ స‌మ‌యంలో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. కానీ ఆ త‌ర్వాత ఇన్నేళ్లు వేగంగా కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి.

ఇంత‌కాలానికి సూర్య‌కు తెలుగు సినిమాపై బుద్ధి పుట్టింది. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేసేందుకు సూర్య ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇక్క‌డ ఇప్ప‌టికే మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను వినిపించిన క‌థను ఓకే చేయ‌నున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా సూర్య‌కు ఓ క‌థ చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. సూర్య ముందుగా ఆ ఇద్ద‌రిలో ఎవ‌రితో ప‌ని చేస్తారు? అన్న‌ది స్క్రిప్టు డిసైడ్ చేయ‌నుంది.

త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం మ‌హేష్ తో సినిమా చేయ‌నున్నారు. ఆ త‌రవాత సూర్య‌తో సెట్స్ కెళ్లేందుకు అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తార‌క్ కూడా త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాల్సి ఉండ‌గా ఎవ‌రితో ముందుగా కుదురుతుంది? అన్న‌ది వేచి చూడాలి. సూర్య‌ తన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. నవరస అనే వెబ్ సిరీస్ లోనూ సూర్య న‌టిస్తున్నారు.
Tags:    

Similar News