మరో పొన్నియిన్‌ సెల్వన్‌.. ఈసారి వెయ్యి కోట్లు!

Update: 2022-11-11 05:35 GMT
తమిళనాట మణిరత్నం భారీ బడ్జెట్‌ తో రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌ మూవీ అవ్వడంతో రెండు పార్ట్‌ లు గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఒక పార్ట్‌ విడుదల అయ్యింది. రెండవ పార్ట్‌ వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాట భారీ బడ్జెట్‌ సినిమాలకు మంచి ఆధరణ ఉందని పొన్నియిన్ సెల్వన్‌ ఫలితంను బట్టి క్లారిటీ వచ్చింది.

అందుకే ముందు ముందు మరిన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు అక్కడ తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడిక్ మూవీ రూపొందబోతుంది. ఆ సినిమాలో హీరోగా సూర్య నటించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే సహజంగానే భారీ బడ్జెట్‌ ని ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటిది సూర్య తో శంకర్ తెరకెక్కించబోతున్న సినిమా కు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శంకర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత సూర్య హీరోగా సినిమా మొదలు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

వేల్పారి చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతుందట. ఈ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్‌ ఖర్చు అవుతుందట. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉందట. అంతే కాకుండా ఈ సినిమాను ఒక్క పార్ట్ లో కాకుండా రెండు లేదా మూడు పార్ట్‌ లుగా విడుదల చేసే విధంగా దర్శకుడు శంకర్ ప్లాన్‌ చేస్తున్నాడు అంటున్నారు.

తమిళనాట ఎన్నో తరాల రాజులు రాజ్యం ను ఏళారు. అందులో ఒక తరం వేల్పారి రాజులది కూడా ఉంది. ఆ రాజ్యం కు సంబంధించిన విషయాలు మరియు రాజుకు సంబంధించిన విషయాలను చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులకు చూపించేందుకు దర్శకుడు శంకర్ రెడీ అవుతున్నాడట.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తో ఒక సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇదే సమయంలో శంకర్ ఇండియన్ 2 ను కూడా ముగించే పనిలో ఉన్నాడు. మరో వైపు రణ్వీర్‌ సింగ్ తో కూడా సినిమా ను చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. మొత్తానికి శంకర్ దర్శకత్వంలో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News