తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ ఫుల్ డిమాండ్ ఉంది. అతడు నటించిన సినిమాలన్నీ తమిళంతోపాటు ఏకకాలంలో తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. 'గజనీ'.. 'యుముడు'.. 'సింగం-2'.. 'ఆకాశం నీ హద్దురా'.. 'జై భీమ్' సినిమాలతో సూర్య టాలీవుడ్లోనూ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు.
ఇటీవలే 'జైభీమ్' సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సైతం గెలుచుకొని సత్తా చాటాడు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా హవా నడుస్తుండటంతో సూర్య సైతం ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. #Surya42 పేరుతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజు కాగా అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. 'A Mighty Valiant Saga' క్యాష్షన్ తో కన్పించిన సూర్య 42 పోస్టర్ ను పరిశీలిస్తే ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ అని అర్థమవుతోంది. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైనా సూర్య అదే జోనర్లో ప్యాన్ ఇండియా మూవీ చేస్తుండటంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు.
తాజాగా #Surya42 కి సంబంధించిన ఒక క్రేజ్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇటీవలే గోవాలో పూర్తయింది. కాగా మరో షెడ్యూల్ కోసం త్వరలోనే సూర్య 42 టీమ్ యూరప్ కు వెళ్లనుంది. ఇప్పటికే పలువురు అక్కడికి వెళ్లి షూటింగ్ లోకేషన్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే లోకేషన్లు ఫైనల్ కానున్నాయి.
కథరీత్య ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా భాగం విదేశాల్లోనే చేయనున్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న #Surya42 సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీని పది భాషలతోపాటు త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా హాట్ బ్యూటీ దిశా పటాని నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.