గన్ పట్టుకున్న వాడు అదే గన్ కు బలైపోతాడు.. కత్తి పట్టిన వాడు అదే కత్తికి కరుసైపోతాడు. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం. ఒక వ్యక్తి ఏదైనా అలవాటుకి బానిసగా మారినా అంతిమంగా ఇదే ఫలితం అనుభవించక తప్పదని కూడా చాలా సందర్భాలలో రుజువైంది కూడా. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ ఇదే తరహా కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. డ్రగ్స్ అనే మత్తు కథ వెనక రకరకాల నాటకీయ పరిణామాలు రక్తి కట్టిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక స్త్రీనే మొత్తం కథను లీడ్ చేయడం పురాణేతిహాసాన్నే తలపిస్తోంది కదూ?
సుశాంత్ బాలీవుడ్ లో వున్న బంధు ప్రీతి కారణంగా మరణించాడనే చర్చ రియాని ఇంటరాగేట్ చేసిన తరువాత నుంచి పక్కదారి పడుతోంది. ఇంతకీ సుశాంత్ ఎందుకు చనిపోయాడన్నది పక్కన పెట్టి అతనే డ్రగ్ ముఠాకి చిక్కాడా? .. వారి ఉచ్చులో రియా కారణంగా ఇరుక్కున్నాడా అనే వేల వేల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రియా ఆమె సోదరుడు షోవిక్ వెల్లడించిన విషయాలు షాకింగ్ గా వున్నాయి. లోనా వాలాలో వున్న సుశాంత్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు జరిగేవని ఆ పార్టీల్లో ఎల్ ఎస్ డీ.. కొకైన్ లాంటి ప్రమాదకర మాదక ద్రవ్యాలు వినియోగించేవారని రియా సంచలన వ్యాఖ్యలు చేయడం.. ఆమె సోదరుడు షోవిక్ కూడా ఇదంతా సుశాంత్ చెబితేనే తామంతా చేశామని తప్పించుకునే ప్రయత్నం చేయడం షాకింగ్ గా వుంది.
ఈ వ్యవహారం చూస్తుంటే సుశాంత్ సింగ్ నే డ్రగ్ మాఫియాలో బంధించిన పద్మవ్యూహంలో ఇరుక్కునేలా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. వీరి వ్యవహారం చూస్తుంటే చనిపోయిన సుశాంత్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియాతో కలిసి గేమ్ ఆడారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసుని తవ్వినా కోద్దీ ఇక బాలీవుడ్ కు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించాలేమో అనేంతగా భయం భీతి అనేది ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదని స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులతో పాటు బిగ్ షాట్స్ తో సంబంధాలున్న బడా ఫిల్మ్ మేకర్ బాలీవుడ్ లో వున్న డ్రగ్ కల్చర్ కి వెన్నుదన్నుగా వుండి తానే ఈ విషబీజాన్ని విస్తృతం చేయడం చూస్తుంటే నవ నాగరికథ ముసుగులో పాశ్చత్య పోకడల యావలో ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం మహా మమా నాయకులకే విస్తుపోయేలా వుందంటే ఎంత విచ్చలవిడి తనంతో వ్యవహరించారో.. సెలబ్రిటీలంతా ఏ స్థాయి మత్తులో తూగడానికి సిద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చనే వాదన బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది.
ఇక పోయిన వాడు పోయాడు.. పోయిన వాడినే వాడేయండి! అంటూ రియా సహా అరెస్టయిన వారందరికీ లాయర్లు చెబుతున్నారా? అందుకే సుశాంత్ నే వీళ్లంతా కార్నర్ చేసి బతికి వున్న వాళ్లను సేవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఇలాంటి పరిపరి విధాలా సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు సుశాంత్ కి అసలు డ్రగ్స్ అలవాటే లేదని అతడి ఎక్స్ డ్రైవర్ చెబుతుండడం చూస్తుంటే.. రియా తన జీవితంలోకి వచ్చాకే అలవాటైందా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా దివంగత సుశాంత్ సింగ్ పద్మవ్యూహంలో చిక్కుకుని అభిమన్యుడిలా నట్టనడిమధ్యనే అంతమయ్యాడన్నది అర్థమవుతోంది.