ఇక‌పై క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా స్థిరప‌డ‌తాడా?

Update: 2019-12-29 17:30 GMT
ప్ర‌భాస్ సినిమాలో గోపిచంద్ విల‌న్ గా న‌టించాడు. అందుకు నామోషీ ఫీల‌వ్వలేదు. బాల‌కృష్ణ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా చేశాడు. అస్స‌లు ఈగో ఫీల‌వ్వ‌లేదు. ఎన్టీఆర్ సినిమాలోనూ జ‌గ‌ప‌తి విల‌న్ గా చేశాడు. అక్క‌డా ఫీల‌వ్వ‌లేదు. ఇక మొన్న‌టికి మొన్న అల్ల‌రి న‌రేష్ సైతం మ‌హ‌ర్షి చిత్రంలో ఫ్రెండు క్యారెక్ట‌ర్ చేశాడు. వేరొక‌రి సినిమాలో నేను క్యారెక్ట‌ర్ చేయ‌డ‌మేమిటి? అనుకుంటే వీళ్లంతా  ఆ మంచి పాత్ర‌ల్లో న‌టించే ఛాన్స్ కోల్పోయేవారేమో!

స‌రిగ్గా ఇదే ఆలోచించాడు హీరో సుశాంత్. అక్కినేని కాంపౌండ్ హీరోగా అత‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే అయినా.. ఇప్పుడు `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ క‌నిపిస్తున్నారు. హీరోలు క్యారెక్ట‌ర్ల‌కు షిఫ్ట‌యితే మ‌ళ్లీ మ‌ళ్లీ అలాంటివే చేయాల్సి ఉంటుంది. హీరోగా ఎదిగేందుకు ఛాన్స్ ఉండ‌ద‌ని ఇమేజ్ పై షిఫ్టింగ్ అనేది తీవ్ర‌ ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటుంటారు. అయితే సుశాంత్ దీనిపై ఏమ‌ని ఫీల‌వుతున్నారు? అంటే.. ఈ వాదంపై త‌ను చేసిన ట్వీట్ అంద‌రికీ స‌ర్ ప్రైజ్ నిచ్చింది.

పెద్ద  స్టార్ సినిమాలో చేశాను. రెండో  హీరో లేదా మూడో హీరో అనేవి న‌మ్మ‌ను. నేను చేసిన పాత్ర‌ను చాలా ఇష్టంగా ప్రేమ‌గా చేశాను.. అయినా అది అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా. అలాంటి గొప్ప టీమ్ తో ప‌ని చేయ‌డం... మంచి రోల్ చేయ‌డం ఆనందాన్నిచ్చింద‌ని అన్నాడు. అంద‌రిలా స్టీరియో టైపోని బ్రేక్ చేయాల‌నే ఉద్ధేశంతోనే ఈ రోల్ చేశాన‌ని సుశాంత్ అన్నాడు.  అయితే హీరోగా ల‌క్ చెక్ చేసుకుని ఆశించిన ఎదుగుద‌ల లేక‌పోవ‌డంతో ఇప్పుడు బ‌న్ని సినిమాలో స‌హాయ‌క పాత్ర‌లో న‌టించాడన్న గుస‌గుస ఎలానూ సాగుతోంది.


Tags:    

Similar News