'జస్టిస్ ఫర్ సుశాంత్' అంటే ఇదేనా...?

Update: 2020-09-29 02:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో సుశాంత్ మరణం వెనుక కారణాలను విశ్లేషిస్తూ.. అతనికి న్యాయం జరగాలి అని #JusticeForSushanth అని నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారు. దీంతో సుశాంత్ కేసుని హై ప్రొఫైల్ కేసుగా తీసుకున్న కేంద్రం.. సీబీఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ మరియు ఈడీ లు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. ఇలా మూడు నెలలుగా సుశాంత్ కి సుశాంత్ ఫ్యామిలీకి న్యాయం జరగాలని అభిమానులు కోరుతూనే ఉన్నారు. అయితే ఈ కేసులో సుశాంత్ కి న్యాయం జరగడం పక్కన పెడితే రోజులు గడిచే కొద్దీ సుశాంత్ డ్రగ్ అడిక్ట్ అని అనుమానాలు కలిగేలా చేస్తోంది.

కాగా, సుశాంత్ కేసు విచారించే క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ డర్టీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి విచారిస్తోంది. అయితే సుశాంత్ గురించి పాజిటివ్ గా స్పందిస్తూ వస్తున్న వారు ఈ కేసులో డ్రగ్ ఇష్యూ వచ్చిన తర్వాత అతనిపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. సుశాంత్ కేసు విచారణ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం రెండు వర్గాలుగా చీలిపోయాయి అనే డౌట్ కలిగించాయి. ఈ మధ్య మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. ఒకప్పుడు సుశాంత్ మంచి లక్షణాల గురించి చర్చించినారు ఇప్పుడు అతనో డ్రగ్ అడిక్ట్ అనే విధంగా చిత్రీకరిస్తున్నారు.

డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన రియా.. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని వెల్లడించింది. అలానే ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరైన శ్రద్ధా కపూర్ సారా అలీఖాన్ ఇద్దరూ కూడా సుశాంత్ షూటింగ్ బ్రేక్ టైంలో డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పినట్లు నేషనల్ మీడియా చెబుతోంది. గతంలో సుశాంత్ సరసన నటించడమే కాకుండా అతనితో చాలా క్లోజ్ గా ఉండే ఈ ఇద్దరూ అతనిపై నిందారోపణలు చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే చనిపోయిన వ్యక్తి ఎలాగూ ఈ విషయాన్ని ఖండించలేడు కాబట్టి.. అతని మీద నిందలు వేస్తూ అప్రతిష్టపాలయ్యేలా చేస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ డెత్ మిస్టరీ కేసు పూర్తిగా బాలీవుడ్ డ్రగ్ మాఫియా కేసుగా పక్కదోవ పట్టినట్లు అనిపిస్తోంది. దీంతో 'జస్టిస్ ఫర్ సుశాంత్' అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వారందరూ జస్టిస్ అంటే ఇదేనా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News