సెలబ్రిటీల్లో చాలామందికి కాస్ట్ లీ కార్లు.. బైకులపై విపరీతమైన ఆకర్షణ కనిపిస్తూ ఉంటుంది. ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ మూవీలో ధోనీగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి కూడా ఇలాంటి ఇష్టం ఉంది. తాజాగా ఈ హీరో మసెరాటి క్వాట్రోపోర్టే కారు లేటెస్ట్ వెర్షన్ కొనుగోలు చేశాడు. దీని ఖరీదు అక్షరాలా 2 కోట్ల 20 లక్షలు ఉంటుందంతే.
గంటకు 307 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారుతో ఇప్పుడు తెగ చక్కర్లు కొట్టేస్తున్నాడు. తనొక్కడే కాదు.. సుశాంత్ లవర్ అని ప్రచారం జరుగుతున్న 1 నేనొక్కడినే ఫేమ్ కృతి సనోన్ తో కలిసి కాస్ట్ లీ కార్ లో రౌండ్స్ వేస్తున్నాడీ హీరో. "నేను ఈ మీనియర్ మోడల్ కార్ తో చిన్నపిల్లాడిలా ఆడుకుంటున్నా. ఈ కార్ ని కొనుగోలు చేసే సరైన సమయం ఇదే. నాతో డ్రైవ్ కి ఎవరొస్తారు" అంటూ ఆ కారుతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.
ఈ మధ్య సుశాంత్- కృతి బ్రేకప్ అయ్యారనే టాక్ వచ్చింది కానీ.. వీళ్లిద్దరూ కలిసి కొత్త కారులో జర్నీ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ వీరిద్దరూ కలిసి పర్సనల్ డ్రైవ్ కి వెళ్లలేదు లెండి.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్- కృతి సనోన్ లు నటిస్తున్న రాబ్తా మూవీ ప్రొడక్షన్ హౌస్ మాడాక్ ఫిలిం ఆఫీస్ కే వెళ్లారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/