సుశాంత్ కేసు విషయంలో సిబిఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే ముంబయి పోలీసులు మరియు పాట్నా పోలీసుల సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడంతో పాటు తాము కూడా సమాచారంను స్వీకరించే పనిలో పడినది. సుశాంత్ మృతి చెందిన ఇంటికి వెళ్లి అక్కడ పరిస్థితులను సిబిఐ పరిశీలించింది. దాంతో పాటు సుశాంత్ వినియోగించిన కొన్ని వస్తువులను కూడా సిబిఐ వారు స్వాదీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏ చిన్న విషయాన్ని కూడా సిబిఐ వారు వదిలి పెట్టడం లేదు.
సుశాంత్ చివరిసారిగా వాడిన సోప్ నుండి తాగి అలాగే వదిలేసిన కాఫీ కప్పు వరకు అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. సుశాంత్ చివరి రోజు తిన్న ఆహార పదార్థాలను కూడా ఇప్పటికే పరీక్షించారట. పనిమనుషులను ప్రశ్నించడంతో పాటు వారి నుండి కీలక సమాచారంను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బాలీవుడ్ ప్రముఖులను ఈ కేసు విషయంలో ఇప్పటికే ముంబయి పోలీసులు ప్రశ్నించారు. మళ్లీ సిబిఐ వారు ప్రశ్నిస్తారా లేదా అనే విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుశాంత్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయి. కను ఆ విషయంలో కూడా సిబిఐ పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.