బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అదే క్రమంలో సుశాంత్ సూసైడ్ పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇక మీడియా సోషల్ మీడియా సుశాంత్ కేసుపై ఫుల్ ఫోకస్ పెట్టి సుశాంత్ మరణం వెనుక కారణాలను విశ్లేషించడం స్టార్ట్ చేసాయి. ఈ క్రమంలో సుశాంత్ డి ఆత్మహత్య కాదని హత్య అనే వాదన వినిపిస్తూ అందరూ సీబీఐ దర్యాప్తు కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది. దీనికి తోడుగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా రంగంలోకి దిగింది.
అయితే అనూహ్యంగా ఈ కేసును విచారించే క్రమంలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు విచారణ చేస్తున్న సీబీఐ మరియు ఈడీ తో పాటు కొత్తగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ నటి రియా చక్రవర్తిని ఆమె సోదరుడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తున్న క్రమంలో బాలీవుడ్ లోని డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల పేర్లను రియా వెల్లడించిందని వార్తలు వచ్చాయి.
సుశాంత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ ఇష్యూ వచ్చిన తర్వాత సీబీఐ ఈ కేసును విచారించలేదు. ఎన్సీబీ బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై కంప్లీట్ ఫోకస్ పెట్టి సెలబ్రిటీలను విచారిస్తోంది. జస్టిస్ ఫర్ సుశాంత్ అని కథనాలు ప్రసారం చేసిన మీడియా కూడా ఆ విషయాన్ని వదిలేసి.. డ్రగ్స్ రాకెట్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సుశాంత్ కూడా రియా తో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇక సుశాంత్ కేసులో దోషులెవరు? ఈ కేసు ఎక్కడి దాకా వచ్చింది? అనే విషయాలపై ఎలాంటి సమాచారం మీడియాలో వెలువడలేదు. ఈ నేపథ్యంలో యువ హీరో డెత్ మిస్టరీ కేసు పక్కదారి పట్టిందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సీబీఐ ఈ కేసును ఛేదించి సుశాంత్ ఫ్యామిలీకి న్యాయం చేయమని కోరుతున్నారు.