బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణించి మూడు సంవత్సరాలు కాబోతున్నా కూడా ఇప్పటి వరకు ఆయన్ను అభిమానులు మరియు జనాలు మర్చిపోలేక పోతున్నారు. ఆయన చనిపోయిన తీరు మరీ విషాదకరం అంటూ ఇప్పటికి కూడా ఆయన గురించి మీడియాలో కథనాలు వస్తూనే ఉండటంతో ఆయన గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తాజాగా మరోసారి సుశాంత్ సింగ్ యొక్క ప్రస్తావన మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఈసారి ఆయన చనిపోయే ముందు నివాసం ఉన్న ఫ్లాట్ గురించి ప్రస్తావన వచ్చింది. సుశాంత్ సింగ్ ముంబయిలోని ఏ ఫ్లాట్ లో అయితే చనిపోయాడో ఆ ఫ్లాట్ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా అద్దెకు ఇవ్వలేదట. సుశాంత్ చనిపోయిన ఫ్లాట్ అవ్వడం వల్ల చాలా మంది ఆ ఫ్లాట్ పట్ల ఆసక్తి చూపించలేదు.
గత రెండు సంవత్సరాలుగా ఆ ఫ్లాట్ ను లీజ్ లేదా అద్దెకు ఇచ్చేందుకు బ్రోకర్స్ ద్వారా ఎన్నారై యజమాని ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ ఇప్పటి వరకు ఆయన ఇంటిని కొత్త కిరాయిదారులకు ఇవ్వలేక పోయాడు. ఎట్టకేలకు ఆ ఫ్లాట్ ను అద్దెకు తీసుకునేందుకు ఒకరు ముందుకు వచ్చారట.
ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ రఫీక్ మర్చంట్ తెలియజేశాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఫ్లాట్ యజమాని నన్ను సంప్రదించాడు. ఎవరైనా అద్దెకు కావాలి అంటే ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలియజేశాడు. చాలా మందికి ఈ ఫ్లాట్ ను చూపించాం. ఎట్టకేలకు ఒక పార్టీ అద్దెకు తీసుకునేందుకు ముందుకు వచ్చారని రఫీక్ పేర్కొన్నాడు.
ఫ్లాట్ ను నెలకు 5 లక్షల అద్దె చొప్పున కొత్త పార్టీకి ఇచ్చారట. అంతే కాకుండా 30 లక్షల రూపాయల అడ్వాన్స్ ను కూడా ఎన్నారై యజమాని పొందాడు అంటూ సమాచారం అందుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆ ఫ్లాట్ లో చనిపోవడం వల్ల అంత తక్కువ అద్దెకు ఇచ్చారని.. లేదంటే ఆ ఫ్లాట్ అద్దె చాలా ఎక్కువగా ఉంటుందని కూడా ముంబై వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.