చిరు 154కి కాస్ట్యూమ్ డిజైన‌ర్ ఎవ‌రు?

Update: 2022-03-10 07:23 GMT
మెగాస్టార్ చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి` త‌రువాత స్పీడు పెంచేశారు. ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో వెంట‌నే మ‌రో చిత్రాన్ని ప్రారంభించిన మెగాస్టార్ ఆ మూవా త‌రువాత బ్య‌లాక్ టు బ్యాక్ వ‌రుస‌గా నాలుగు చిత్రాల‌ని లైన్ లో పెట్టేశారు. ప్ర‌స్తుంత ఈ చిత్రాల‌న్నీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి.

 స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేస్తున్న `ఆచార్య‌` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిపోయింది. దేశాదాయ భూముల కుంభ‌కోణం నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీని ఏప్రిల్ 29న విడుద‌ల చేయాల‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ రిలీజ్ డేట్ ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సిద్ధాగా రెబ‌ల్ లీడ‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. చ‌ర‌ణ్ కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తోంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ త‌రువాత మెగాస్టార్ `గాడ్ ఫాద‌ర్‌, వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి రానుంది.

ఇందిలా వుంటే చిరు 154 మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా చిరు న‌టిస్తున్న ఈ మూవీ వైజాగ్ షిప్ హార్బ‌ర్ నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి రాబోతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలోని ఓ కీల‌క అతిథి పాత్ర‌లో హీరో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించ‌బోతున్నారంటూ వార్త‌లు వ‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా చిరు పెద్ద కుమార్తె సుష్మిత వ‌ర్క్ చేస్తోంది.

ఇదే విష‌యాన్ని మేక‌ర్స్ గురువారం ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా సుష్మిత‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. జై చిరంజీవి చిత్రం నుంచి సుష్మిత మెగాస్టార్ చిరంజీవి చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా వ్య‌హ‌రిస్తున్నారు. అయితే `ఖైదీ నంబ‌ర్ 150` స‌మ‌యంలోనే ఆమె పేరు బ‌య‌టికి రావ‌డం గ‌మ‌నార్హం.      


Tags:    

Similar News