మాజీ భర్త ప్రీమియర్.. ఈమెకు పనేంటో

Update: 2017-01-24 06:24 GMT
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. భార్య సుసానే ఖాన్ కు రెండేళ్ల క్రితం విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల తమ అనుబంధానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు వీరిద్దరూ.

తాజాగా ముంబైలో హృతిక్ రోషన్ లేటెస్ట్ మూవీ కాబిల్ కు ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోకు సుసానే ఖాన్ కూడా రావడం అందరినీ ఆకర్షించింది. ఏదో వచ్చాను.. వెళ్లాను.. అన్నట్లుగా కాకుండా సెలబ్రిటీలతో కలిసి తెగ ఫోటోలు కూడా దిగేసి హంగామా చేసింది సుసానే. రెండేళ్ల క్రితం విడిపోయినా.. మాజీ భర్త అంటే తన ప్రేమను ప్రదర్శించేందుకు సుసానే ఖాన్ ఏ మాత్రం సంశయాలు వ్యక్తం చేయదు. ఇప్పుడు కాబిల్ ప్రీమియర్ షోకి రావడం కూడా ఇలాంటిదే అని చెప్పాలి. విడాకులు తీసుకున్నా హృతిక్-సుసానేలు ఎప్పుడూ రోడ్డుకెక్కలేదనే విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు.. అవసరం అయిన టైంలో మాజీ మొగుడికి అండగా ఉంటోంది సుసానే.

హృతిక్ రోషన్-కంగనా రనౌత్ ఎపిసోడ్ లో కూడా.. తన ఎక్స్ హజ్బెండ్ నే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది సుసానే. ఆ తర్వాత పిల్లలు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి హృతిక్-సుసానేలు ఫారిన్ టూర్ కూడా వేశారు. చట్టబద్ధంగా విడిపోయినా.. ఒకరికొకరు మానసికంగా మాత్రం బాగా అండగానే ఉండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News