సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రాబోతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ బ్యాక్ డ్రాప్ గురించి అనేక నివేదికలు ఉన్నాయి. ప్రెజెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ - ఆర్థిక నేరగాళ్ళు - రుణాలు - వసూలు వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ ఉంది.
'సర్కారు వారి..' సినిమా కథపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ చుట్టూ తిరుగుతుందని ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వెల్లడించారు. అంతేకాదు దీని కోసం మూడు బ్యాంక్ సెట్స్ తో సహా మొత్తం ఎనిమిది సెట్‌లను నిర్మించినట్లు తెలిపారు.
ఇందులో రెండు మోడరన్ బ్యాంకులైతే.. ఒకటి పాతకాలపు బ్యాంకు సెట్ అని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం యాభై ఏళ్ల క్రితం బ్యాంకులు ఎలా ఉండేవో.. అలాంటి బ్యాంక్ సెట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశామని.. వింటేజ్ సెట్ కోసం చాలా రీసెర్చ్ చేసినట్లు కళా దర్శకుడు తెలిపారు. దీనిని బట్టి హీరో పాత్రకు పరశురాం కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు అర్థం అవుతుంది.
అలానే హీరో నివసించే ఓ కాలనీ సెట్ ని నిర్మించారని చెప్పారు. వైజాగ్ లో జరిగే స్టోరీ కావడంతో గోవాలో షూటింగ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసారట. అయితే ప్రాక్టికల్ గా సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో.. మళ్ళీ హైదరాబాద్ లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని.. దాన్ని వైజాగ్ స్ట్రీట్ గా కథకు తగ్గట్టు డిజైన్ చేశారట.
సినిమాలో 80 శాతం వరకూ సెట్స్ లోనే షూటింగ్ జరిగిందని.. చాలా ఇంటీరియర్ - ఎక్స్టీరియర్ డిజైన్ చేశామని ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు. మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో రియలిస్టిక్ లోకేషన్స్ లో షూటింగ్ చేయడం కష్టం కాబట్టి.. ఎక్కువగా సెట్స్ వేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఖర్చు పెరిగినా.. పని దినాలు తగ్గుతాయి కాబట్టి నిర్మాతలకు ఆ విధంగా అక్కడ బడ్జెట్ కంట్రోల్ అవుతుంది.
'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. అలానే ఎస్ఎస్ థమన్ స్వరపరిచిన మూడు పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో SVP ట్రైలర్ మరియు మాస్ సాంగ్ రాబోతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న 'సర్కారు వారి పాట' ప్రచార కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నిడివి రెండున్నర గంటల దాకా వచ్చినట్లు టాక్ నడుస్తోంది.