విశాఖ సాగర తీరంలో ఎస్వీఆర్ విగ్రహం

Update: 2020-12-07 00:30 GMT
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గొప్ప నటుడు ఎస్వీ రంగారావుకు ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతోంది. ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కంటే కూడా సీనియర్ నటుడు. ఆయన పలికించే భావం లేదు.

ఈ క్రమంలోనే ఎస్వీఆర్ కు విశాఖకు అవినాభావ సంబంధం ఉంది. విశాఖలోని ఏవీఎన్ కాలేజీలోనే ఎస్వీఆర్ ఇంటర్మీడియెట్ చదివారు. విశాఖ సాగర తీరంలోనే విద్యనభ్యసించారు. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినిమాకు వన్నె తెచ్చిన ఆయన మరణించి నాలుగున్నర దశాబ్ధాలు అవుతున్నా సినిమాల ద్వారా ఆయన బతికే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని విశాఖలో ఏర్పాటు చేయడంతోపాటు ఆయన పేరిట కళాపీఠాన్ని కూడా సాంస్కృతిక రాజధాని విశాఖలో నెలకొల్పడానికి ఆయన సోదరుడి కుమారుడు రఘురాం నాయుడు సంకల్పించారు.

ఇప్పటికే విగ్రహ ఏర్పాటుకు విశాఖ నగరపాలక సంస్థ కూడా అంగీకరించింది. విశాఖ సాగర తీరాన ఠీవీగా ఉండే ఎస్వీఆర్ విగ్రహం ఇక తెలుగు సినీ యోధుడిని ప్రజలకు కనువిందు చేయనుంది.


Tags:    

Similar News