నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. గత 23 రోజులుగా హరియాణా-ఢిల్లీ సరిహద్దుోలని సింఘు వద్ద లక్షన్నర మంది రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రతిపాదించిన కొన్ని సవరణలను రైతు సంఘాలు తిరస్కరించాయి. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు పలువురు విపక్ష నేతలు - ప్రముఖులు - బాలీవుడ్ నటులు - కళాకారులు క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో రైతుల నిరసనకు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ స్వయంగా మద్దతు తెలిపారు. కొంతకాలంగా రైతుల ఆందోళనకు మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోన్న స్వరా భాస్కర్...గురువారం స్వయంగా రైతుల ఆందోళనలో పాల్గొన్నారు.
సినీరంగంలోని సమస్యలతో పాటు పలు సామాజిక సమస్యలపైనా స్వరా భాస్కర్ మీడియా - సోషల్ మీడియాలో స్పందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, స్వరా భాస్కర్ కంటే ముందు రైతుల ఆందోళనలో ప్రముఖ పంజాబీ గాయకుడు - నటుడు దిల్జీత్ దోసాంజ్ - యువ క్రికెటర్ మన్ దీప్ సింగ్ లు స్వయంగా పాల్గొన్న సంగతి తెలిసిందే. నిరసనలో కూర్చున్న రైతులు పిజ్జాలు తినడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. రైతుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరించిన నెటిజన్లకు దోసాంజ్ కౌంటర్ ఇచ్చారు. రైతులు విషయం తాగినప్పుడు లేవని నోళ్లు...రైతులు పిజ్జా తింటే ప్రచారం చేస్తున్నాయటూ దీటుగా జవాబిచ్చాడు దోసాంజ్. పిజ్జా తయారీలో వాడేవన్నీ రైతులు పండించినవేనని - అలాంటప్పుడు వాళ్లు పిజ్జాలు తింటే తప్పేంటని దోసాంజ్ ప్రశ్నించాడు. దోసాంజ్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.