గుడికి వెళ్లేటప్పుడు వీలైనంతవరకూ పాత చెప్పులు వేసుకెళ్లాలన్న సలహాలు ఇస్తుంటారు చాలామంది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ విన్నట్లు లేదు. తాజాగా గుడికి వెళ్లిన ఆమె.. చెప్పులు పోగొట్టుకొన్న వైనం సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది.
గణేశ్ చతుర్థి వేడుకల్లో భాగంగా ముంబయిలోని ప్రముఖ దేవాలయమైన లాల్ బాగ్ చా రాజు దేవాలయానికి వెళ్లారు స్వర భాస్కర్. దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసరికి తన జోధ్ పూర్ చెప్పులు మాయం కావటంతో అవాక్కు అయ్యింది. కాసేపు వెతికినా చెప్పులు కనిపించకపోవటంతో.. చెప్పుల్లేని కాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ కారు వద్దకు చేరుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసినోళ్లు పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గుడికి వెళ్లినప్పుడు చెప్పుల్ని స్టాండ్ లో పెట్టాల్సిందని ఒకరు సలహా ఇస్తే.. మరొకరు స్టాండ్ లో పెట్టకుండా కక్కుర్తి పడి ఉంటుందని.. అందుకే ఇబ్బంది తప్పలేదని వ్యాఖ్యానించారు. మరికొందరు చెప్పులు నచ్చేసి తీసుకెళ్లి ఉంటారన్నారు. ఇలాంటి సమయాల్లో కారులోనే చెప్పులు వదిలేసి వస్తే సరిపోయేదిగా? అంటూ సూచన చేశారు. మొత్తానికి స్వర భాస్కర్ చెప్పులు పోవటమేమో కానీ.. ఆమె ఒకసారి అందరి దృష్టిలో పడ్డారని చెప్పక తప్పదు.