నా చీరపై ఎన్ని కామెంట్లు బాబోయ్‌

Update: 2015-08-29 07:24 GMT
తెలుగమ్మాయ్‌ స్వాతి 'త్రిపుర'గా భయపెట్టేందుకు వస్తోంది. గీతాంజలి ఫేం రాజ్‌ కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో పాటు సేమ్‌ టైమ్‌ స్వాతి నటించిన ఓ మలయాళ చిత్రం రిలీజ్‌ కి వస్తోంది. ఈ సందర్భంగా స్వాతి కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాల్ని ముచ్చటించింది.

=నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజవుతున్నాయి. ఇది ఆనందాన్నిచ్చేదే.

= త్రిపుర చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఇదో చక్కని హారర్‌ థ్రిల్లర్‌. నవీన్‌ చంద్ర హీరో. నా భర్తగా నటించాడు. నవీన్‌ డాక్టర్‌ పాత్రలో కనిపిస్తాడు.

=ఎవరు లీడ్‌ రోల్‌ చేశారు.. అన్నది అనవసరం. సినిమా చూస్తుంటే కేవలం పాత్రలు మాత్రమే కళ్లముందు కదులుతాయి. త్రిపురలో నేను చీరకట్టాను. ఇది వెరీ స్పెషల్‌.

= 16 ప్రాయం నుంచే చీర కడుతూనే ఉన్నా. మొదటిసారి కృష్ణ వంశీ దర్శకత్వంలోని 'డేంజర్‌' సినిమా కోసం చీరకట్టాను. మరీ స్కూలు పిల్లలా ఉన్నావే అన్నారు. ఆ తర్వాత మళ్లీ 'అష్టా చెమ్మా' కోసం చీరకట్టుకున్నా. స్కూల్లో టీచర్స్‌ డే ఫంక్షన్‌ కి వెళుతున్న టీచరమ్మలా ఉన్నావ్‌ అన్నారు. ఆ తర్వాత మరోసారి 'గోల్కొండ హైస్కూల్‌' సినిమా కోసం చీర కట్టుకున్నా. చాలా బాగున్నావ్‌ కానీ, కాస్త సన్నగా ఉన్నావే.. అన్నారు.

= అంటే నేను చీర కట్టిన ప్రతిసారీ కుర్రాళ్లు వంక పెడుతూనే ఉన్నారు. నాపైనా, నా చీరపైనా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. త్రిపురలో మాత్రం అలా వంక పెట్టడానికి అవకాశమే లేదు. అంత బావుంటుంది.. సుమీ అంటూ చాలా సంగతులే స్వాతి చెప్పింది.
Tags:    

Similar News