నాగార్జున ప్రధాన పాత్రలో దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజన్న’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్వేతామీనన్... ఆ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. మలయాళంలో విడుదలైన సినిమాలే తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. రాజన్న సినిమాలో శ్వేతామీనన్ పోషించిన పాత్రకు మంచి అప్లాజ్ రావడంతో.. ఆ తరువాత ఆమె డబ్బింగ్ చిత్రాలతో బాగానే హవా కొనసాగించింది. అందులో చాలా మటుకు వాంప్ క్యారెక్టర్లతోనే ఆమె ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యింది.
తాజాగా ఈ అమ్మడు మరోసారి తెలుగులో నటిస్తోంది. కల్వకుంట్ల తేజేశ్వరరావు(కన్నారావు) నిర్మాతగా ‘షీ’ అనే మూవీ తెరకెక్కుతోంది. పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో 999 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను శ్వేతామీనన్ పోషిస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు శివాజీ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. దాదాపు 50 సినిమాల దాకా హీరోగా నటించిన శివాజీ... తాను జగపతిబాబులాగే విలన్ పాత్రలు పోషించడానికి రెడీ అయిపోయాడు. గత రెండున్నరేళ్లుగా రాజకీయాల్లో వున్న శివాజీ... అక్కడ వర్కవుట్ కాలేదని ఇక నెగివ్ పాత్రలైనా పోషించి మళ్లీ వెండితెరపై రాణించాలని చూస్తున్నాడు. మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇందులో ప్రముఖ తమిళ హీరో శింబు - సంగీత దర్శకుడు అనిరుధ్ కలిసి ఓ పాటను పాడబోతున్నారు.