2014తో.. వాళ్ళ దేశంలో మనం సినిమాలు తీయడం మొదలుపెట్టి 50 సంవత్సరాలు అయ్యింది. అదే స్విట్జర్ ల్యాండ్. అసలు ఇంగ్లీష్ బాష తెలియని ఒక యురోపియన్ దేశంలో.. తొలిసారి రాజ్ కపూర్ కు 1964లో ''సంగం'' సినిమా ఎందుకు తీయాలని అనిపించిందో తెలియదు కాని.. ఆ దెబ్బతో వరుసగా అక్కడ మనోళ్ళు సినిమాలు తీస్తూనే ఉంటారని ఎవ్వరూ అనుకోలేదు. అయితే సంగం సినిమాలో యురోప్ మొత్తం చూపించారు. కాని 1970లో యాశ్ చోప్రా.. తన హనీమూన్ కోసం స్విట్జర్ ల్యాండ్ వెళ్ళి.. టోటల్ గేమ్ మార్చేశారు.
అసలు సింగిల్ హ్యాండెడ్ గా కేవలం ఆల్ప్స్ పర్వత శ్రేణుల మధ్యన గల సుందర నగరాలైన జెనీవా.. ఇంటర్ లేకెన్ తదితర ప్రదేశాల్లో ఆయన సినిమాను షూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక యాశ్ చోప్రా కొడుకు ఆదిత్య తన డెబ్యూ సినిమా దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే కోసం ఏకంగా ఫస్టాఫ్ మొత్తం స్విస్ లోనే ప్లాన్ చేశాడు. ఆ దెబ్బతో ఇండియా నుండి యురోప్ టూర్ కు వెళ్లిన ఎవరైనా కూడా.. స్విట్జర్ ల్యాండ్ వెళ్లకుండా రాలేరు. అందుకే యాశ్ చోప్రా తమ దేశానికి ఎంతో చేశారంటూ స్విట్జర్ ల్యాండ్ వారు సైతం చెబుతుంటారు.
ఆయన సేవలను గుర్తిస్తూ ఇప్పుడు ఇప్పుడు వారి దేశంలో యశ్ చోప్రా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కెమెరాతో యశ్ ఫోజిస్తున్నట్లు ఉంటుందా విగ్రహం. 2012లో యాశ్ మరణించిన సంగతి తెలిసిందే.