ఉయ్యాల‌వాడ న‌ట్టింట సైరా సైర‌న్‌?

Update: 2019-09-05 05:46 GMT
`సాహో` హ‌డావుడి త‌గ్గింది. ఇక నెమ్మ‌దిగా జ‌నాల దృష్టంతా మ‌రో భారీ చిత్రం `సైరా`పైకి మ‌ళ్లుతోంది. బాహుబ‌లి - సాహో లాంటి భారీ చిత్రాల‌కు పోటీ ఇచ్చే ప్ర‌య‌త్న‌మేనా ఇది? ఈ సినిమాకి ఎలాంటి ప్ర‌చారం చేయ‌బోతున్నారు?  ఎంత భారీ స్థాయిలో బిజినెస్ సాగుతోంది? నాన్ థియేట్రిక‌ల్ రేంజు ఎంత‌? రిలీజ్ ఏ స్థాయిలో ఉంటుంది?  బాక్సాఫీస్ రికార్డులు ఎలా ఉండ‌బోతున్నాయి? .. ఇవ‌న్నీ అభిమానుల్లో హాట్ టాపిక్ కానున్నాయి. ముఖ్యంగా రిలీజ్ కి ఇంకో నెల‌రోజుల స‌మ‌యం కూడా పూర్తిగా లేదు కాబ‌ట్టి ఈలోగానే సైరా- న‌ర‌సింహారెడ్డి కి ఏ స్థాయి బ‌జ్ తీసుకురానున్నారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది.

అయితే వీట‌న్నిటికీ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నుంచి ఆన్స‌ర్ లేదా? అంటే .. తొంద‌ర్లోనే అధికారికంగా ప్ర‌చారానికి సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్నార‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 2న సైరా రిలీజ‌వుతోంది కాబ‌ట్టి స‌రిగ్గా 17 రోజుల ముందు ఆడియో ఈవెంట్ కి ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఇలాకా అయిన కర్నూల్ లో ఈ నెల 15న సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే పోలీస్ అనుమ‌తులు స‌హా ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారట‌. ఈ వేడుక‌కు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్- సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వంటి ప్ర‌ముఖుల్ని అతిధులుగా ఆహ్వానిస్తున్నార‌ని తెలుస్తోంది.

అంతేకాదు..  బాహుబ‌లి- సాహో ఈవెంట్ల‌కు ప్ర‌భాస్ అభిమానుల్ని భారీ ఎత్తున ర‌ప్పించారు. అంత‌కుమించి `సైరా-న‌ర‌సింహారెడ్డి` ఈవెంట్ ని స‌క్సెస్ చేయాల‌న్న పంతం మెగా కాంపౌండ్ లో అంత‌కంత‌కు పెరుగుతోంద‌ట‌. అందుకోసం వేలల్లో స‌రిపెట్ట‌కుండా ల‌క్ష‌లాది మంది మెగాభిమానుల్ని తెలుగు రాష్ట్రాలు స‌హా ఇరుగు పొరుగు నుంచి ర‌ప్పించ‌నున్నార‌ని తెలుస్తోంది. మెగా ఈవెంట్ అంటే అభిమానుల్లో ఒక‌టే సంద‌డిగా ఉంటుంది కాబ‌ట్టి ఫ్యాన్స్ ఉర‌క‌లెత్తిన ఉత్సాహంతో బ‌రిలో దిగుతార‌న‌డంలో సందేహ‌మే లేదు. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. దాదాపు 200కోట్లు పైబ‌డిన బడ్జెట్ పెడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే రిట‌ర్నులు ర‌ప్పించేలా జ‌నాల్లో ప్ర‌చారం ప‌రంగానూ దూసుకెళ్లేందుకు చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. సాహో త‌ర‌హాలోనే హైద‌రాబాద్- ముంబై- బెంగ‌ళూరు- చెన్న‌య్- కొచ్చి- పూణే వంటి చోట్ల మెగాస్టార్ మెరుపు ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News