మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో వేసిన సెట్టింగ్స్ కాలిపోవడంతో భారీ నష్టం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగనప్పటికీ రూ.3 కోట్ల దాకా నష్టం వచ్చినట్లు వెల్లడైంది. మరి ఈ సెట్టింగ్స్ కు బీమా చేయించారా.. నష్టపరిహారం అందుతుందా లేదా అన్నది తెలియదు. ఈ దుర్ఘటన బాధాకరమైందే కానీ.. దీని వల్ల ‘సైరా’ షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ అయితే తెలిసింది.
‘సైరా’ షూటింగ్ విషయంలో కొంత కాలంగా రకరకాల రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమవుతోందని.. ఇంకా షూటింగ్ పార్ట్ చాలానే మిగిలుందని.. దసరా రిలీజ్ కష్టమే అని వార్తలొచ్చాయి. ఐతే చిత్ర నిర్మాణ సంస్థ అలాంటిదేమీ లేదనే సంకేతాలు ఇచ్చింది. యాక్సిడెంట్ గురించి చెబుతూ.. ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్లో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కాలిపోయిన సెట్టింగ్స్ లోనే చివరి షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఈ ప్రమాదం వల్ల కొన్ని రోజులు షూటింగ్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్లో తెలిపింది. మొత్తానికి కొన్ని నెలలుగా ‘సైరా’ షూటింగ్ గురించి ఏ అప్ డేట్ లేక డీలా పడిపోయిన మెగా అభిమానులు.. సినిమా చివరి దశలో ఉన్నట్లు అధికారికంగానే వెల్లడించడంతో కొంత హ్యాపీగానే ఉన్నారు.