జీఎస్‌ టీ తో చిక్కుల్లో ప‌డ్డ ర‌జ‌నీ!

Update: 2017-07-01 13:39 GMT
నేటి నుంచి దేశ‌వ్యాప్తంగా జీఎస్‌ టీ అమ‌లులోకి వ‌చ్చింది. జీఎస్‌టీతో దేశం అభివృద్ధి పథంలో ప‌య‌నిస్తుంద‌ని, అంద‌రికీ ల‌బ్ది చేకూరుతుంద‌ని మోడీ ఆలోచ‌న. కానీ, వాస్త‌వ ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జీఎస్‌ టీ ప్ర‌భావం అనేక రంగాల‌పై ప్ర‌త్య‌క్షంగా - ప‌రోక్షంగా ప‌డ‌నుంది. ముఖ్యంగా వేలాదిమందికి ఉపాధి క‌ల్పిస్తున్న సినీ రంగం జీఎస్‌ టీ ఎఫెక్ట్‌ తో సంక్షోభంలో ప‌డునుంది.

అందులోనూ దక్షిణాది సినీ పరిశ్రమపై జీఎస్‌ టీ ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌ని సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. హిందీ సినిమాలకు జీఎస్‌ టీ ఉపకరిస్తుందనే వాదనా లేకపోలేదు.

వినోదపు పన్ను రాయితీ - సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడంలోనూ ప్రభుత్వాలు నిర్ల‌క్షం వ‌హించాయ‌న్న‌  ఆరోపణలున్నాయి. జీఎస్‌ టీ గురించి సినీ పరిశ్రమ చేసిన‌ విజ్ఞప్తుల్ని కేంద్రం పరిగణంలోకి తీసుకోలేదు.
ఈ నేప‌థ్యంలో జీఎస్‌ టీని వ్యతిరేకిస్తూ జులై 3 నుంచి తమిళ సినీ పరిశ్రమ  థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చింది. ఎన్ని రోజులపాటు బంద్‌ చేయాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

రాజకీయాల్లోకొస్తానంటున్న రజనీకాంత్‌ జీఎస్‌ టీపై స్పందించాలనీ కొందరు నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారు.
శింబు తండ్రి - ప్రముఖ నిర్మాత - దర్శకుడు టి.రాజేందర్‌ అయితే రజనీకాంత్‌ పై ఆవేశంతో ఊగిపోయారు. సినీ పరిశ్రమను ఉద్ధరించలేని రజనీకాంత్‌, రాజకీయాల్లోకొచ్చి ఏం చేస్తాడని ప్రశ్నిస్తున్నారాయన.

మొత్తానికి ఈ  జీఎస్‌ టీ దెబ్బ రజనీకాంత్‌ కి గట్టిగానే తగిలేలా వుంది. తమిళ సినీ పరిశ్రమ జీఎస్‌ టీ వ్యతిరేక ఆందోళనకు, ర‌జ‌నీకాంత్‌ కు సంబంధం ఏమిట‌నా మీ ప్ర‌శ్న‌? ప్రధాని నరేంద్రమోడీకి రజనీకాంత్‌ స్నేహితుడు కాబట్టి అటువంటి సందేహాలు రావ‌డం స‌హ‌జం.!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News