అందాల నయనతారకు తమిళ పరిశ్రమలో శత్రువులు పెరుగుతున్నారా? అంటే అవుననే అర్థమవుతోంది. ఇంతకుముందు ప్రముఖ నటుడు రాధారవి చేసిన కామెంట్లను ఇంకా అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేదు. నయన్ సెక్సిస్ట్.. అందుకే అంత పెద్ద స్థాయికి ఎదిగింది అనే అర్థం వచ్చేలా.. తీవ్ర పదజాలం ఉపయోగించడంతో ఆ తర్వాత అతడు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పెద్ద రచ్చయ్యింది. అతడిని డీఎంకే పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఆ తరహా కామెంట్లు కాదు కానీ.. దర్శకరచయిత కం సీనియర్ నటుడు నంద పెరియ స్వామి నయన్ ని తగ్గించే వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడ్డాడు.
ఆయన ఏడాది క్రితమే నయనతారకు ఒక కథ చెప్పి 12 నిమిషాల డెమో వీడియో కూడా చూపించాడట. కథ అద్భుతంగా ఉంది. ఫెంటాస్టిక్ .. మార్వలస్.. ఈ చిత్రాన్ని నేనే నిర్మిస్తాను.. నటిస్తాను! అంటూ ప్రామిస్ చేసిందట. దీంతో ఏడాదిగా అతడు ఎదురు చూశాడు. కానీ తను ఇప్పటికీ చేయలేకపోయింది. దీంతో అదే ప్రాజెక్టును తాప్సీ కథానాయికగా ఇటీవలే ప్రారంభించేశారు. రష్మి రాకెట్ అనేది ఈ సినిమా టైటిల్. మొన్న రిలీజైన తాప్సీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఒక గ్రామం నుంచి వచ్చిన యువతి ఫాస్ట్ రన్నర్ గా జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది.. అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ కథ రాసింది పెరియ స్వామి.
ఇకపోతే నయన్ తనని ఇన్నాళ్లు వెయిటింగ్ చేయించినందుకు సదరు దర్శక రచయిత పెరియ స్వామి తీవ్రంగా హర్టయ్యారని అర్థమవుతోంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని అన్నారో ఏమో కానీ.. నయన్ కంటే తాప్సీనే బెటర్ నటి అంటూ కితాబిచ్చేశాడు. అయినా పెరియ స్వామి అన్నంత మాత్రాన నయన్ తలైవి కాకుండా పోతుంది. రెండు దశాబ్ధాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న నయన్ .. ప్రస్తుతం హీరోలకు ధీటుగా తనకు కూడా మార్కెట్ ఉందని నిరూపిస్తోంది. పరిశ్రమ అగ్రకథానాయకులందరికీ తను మాత్రమే ఆప్షన్ అని నిరూపిస్తోంది. రజనీ దర్బార్- విజయ్ బిగిల్- చిరంజీవి సైరా నరసింహారెడ్డి .. ఇలా అన్నీ భారీ చిత్రాల్లో నటిస్తోంది. అంతెందుకు తాప్సీ ఆరేడేళ్ల పాటు తమిళంలో నటించింది. కానీ నయన్ అంత స్టార్ అనిపించుకోగలిగిందా? అంత పెద్ద స్టార్ ని ఉద్ధేశపూర్వకంగా తగ్గించేందుకు ఆయన ప్రయత్నించినా అభిమానులు దానిని లెక్క చేస్తారా? అసలు పెరియ స్వామి అనే రచయిత ఉన్న సంగతి తెలిసింది ఎందరికి? కించపరిచినంత మాత్రాన నయన్ ట్యాలెంట్ ఏమిటో లోకానికి తెలియకుండా పోతుందా సారూ?