అవార్డులపై తాప్సి స్వరం విన్నారా?

Update: 2017-04-11 13:01 GMT
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ గత ఏడాదే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆ సందర్భంగా ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్నతలు చెప్పారు. కానీ ఇదే పెద్ద మనిషి గతంలో పద్మ పురస్కారం ఆశించి భంగ పడ్డపుడు ఆ అవార్డుల ఎంపిక తీరును తప్పుబట్టారు. లాబీయింగ్ ద్వారానే ఈ అవార్డులు వస్తాయని తీర్మానించారు. అనుపమ్ ఖేర్ లాంటి పెద్దాయనే ఇలా స్వరం మార్చినపుడు.. మన తాప్సి ఎంత చెప్పండి.

అసలు వీళ్లిద్దరికీ ఇప్పుడు పోలికెందుకు వచ్చింది అంటే.. గత ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా ‘పింక్’లో తాప్సి మంచి నటనే కనబరిచింది. ఆ చిత్రానికి పలు పురస్కారాలు దక్కాయి. తాప్సి కూడా కొన్ని అవార్డులు చేజిక్కించుకుంది. ఈ సినిమాకు ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంటుందని కొందరు జోస్యం చెప్పారు. కానీ జ్యూరీ సభ్యులు మలయాళ నటి సురభికి పురస్కారం కట్టబెట్టారు.

దీంతో తాప్సి విమర్శలకు తెరతీసింది. ఇక్కడ గ్రూపులు కడితేనే అవార్డులు వస్తాయంటూ విమర్శలు గుప్పించేసింది తాప్సి. కానీ ‘పింక్’ సినిమాకు జాతీయ అవార్డుల్లో వేరే పురస్కారాలు దక్కిన సంగతి మరిచిపోతుంది తాప్సి. ఇంతకుముందు సౌత్ సినిమాల్లో తన ప్రస్థానం ముగిశాక ఇక్కడి సినిమాలపై విమర్శలు గుప్పించి.. బాలీవుడ్ మీద ప్రశంసలు కురిపించేసిన తాప్సి.. గత ఏడాది ‘పింక్’ సినిమాకు వివిద పురస్కారాలు దక్కినపుడు చాలా వినమ్రంగా మాట్లాడింది. కానీ ఇప్పుడు గ్రూపులు కడితేనే అవార్డులంటూ జ్యూరీ సభ్యుల్ని.. బాలీవుడ్ ను కూడా విమర్శిస్తోంది తాప్సి. అంటే తనకు అవార్డు వస్తే సక్రమంగా ఉణ్నట్లు.. లేకుంటే అంత అక్రమమే అన్న చందాన ఉంది తాప్సి మాటతీరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News