ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను చాలా ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. కాంటాక్ట్స్ మెయింటెయిన్ చేయడంలో దిట్ట అయిన ఈ భామ.. హిట్స్ లేకపోయినా భారీ సినిమాల్లో స్టార్ హీరోల సరసన బాగానే ఆఫర్స్ దక్కించుకునేది. కానీ హిట్స్ మాత్రం లేకపోవడంతో మెల్లగా ఛాన్సులు తగ్గిపోయాయి. కానీ గంగ హిట్ తో బౌన్స్ బ్యాక్ కావడంతో.. తాప్సీకి వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
వచ్చిన ఆఫర్లలో తనకు సూటబుల్ గా సెలెక్ట్ చేసుకుంది తాప్సీ. కానీ వాటికి బైబై చెప్పేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అందరినీ. ఇప్పటికి మూడు ప్రాజెక్టులకు గుడ్ బై చెప్పిందంటే.. ఇలా ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం ఈమెకు ఎంతగా అలవాటు అయిందో అర్ధమవుతుంది. ఇప్పటికే నిఖిల్ మూవీ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు, తర్వాత సెల్వ రాఘవన్ సినిమాకి కూడా హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు సందీప్ కిషన్ కి ఇస్తూ.. ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు చెప్పేసింది.
పిజ్జా సినిమాను ప్రొడ్యూస్ చేసిన సీవీ కుమార్.. డైరెక్టర్ గా మారుతూ ఓ సినిమా చేస్తున్నాడు. సైఫై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా చేస్తుండగా, హీరోయిన్ గా తాప్సీ ఒప్పుకుంది. కానీ సడెన్ గా డేట్స్ లేవంటూ ఈ సినిమా చేయలేనని చెప్పేసింది తాప్సీ. అలాగని ఈమె చేతినిండా సినిమాలేం లేవు. ప్రస్తుతానికి దగ్గుబాటి రాణాతో ఘాజి ఒకటే చేస్తోంది తాప్సీ. మరి ఇలా డేట్స్ లేవని చెబుతూ.. వరుసగా సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటో!