ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్నుకి పాకిస్తాన్ కి ఎక్కడో లింక్ ఉందేమో అనుకోవాలి. ఎందుకంటే మరోసారి పాక్ తో లింక్ ఉన్న కేరక్టర్ చేస్తోంది ఈ భామ. గతంలో సాహసం అనే మూవీలో పాకిస్తాన్ వెళ్లే టూరిస్ట్ పాత్రను చేసిన తాప్సీ.. ప్రస్తుతం దగ్గుబాటి రాణా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాజీ మూవీలో పాక్ శరణార్ధి రోల్ ని చేస్తోంది.
గ్లామరస్ రోల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నాల తర్వాత.. ఇప్పుడు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు తాప్సీ కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ఘాజీలో తాప్సీ పాత్ర ఓ శరణార్ధి కావడంతో.. మేకప్ లేకుండా నటిస్తోందట. 'గతానికి సంబంధించిన నిజ జీవిత పాత్రల్లో చేయడం క్లిష్టమైన విషయం. అయినా ఇలాంటి రోల్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ఈ మూవీలో చాలా భాగం సబ్ మెరైన్ లోనే జరుగుతూ ఉంటుంది. ఒకటే ప్రాంతంలో తిరిగే స్టోరీ కావడంతో.. యాక్టింగ్ కు స్కోప్ ఎక్కువ. అలాగే ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా చేస్తున్నాను ' అని చెప్పింది తాప్సీ.
ఈ పాత్ర చేసేందుకు గాను బరువు కూడా తగ్గుతోందట ఈ భామ. అందుకోసం ఫుడ్ హ్యాబిట్స్ ను కూడా ఛేంజ్ చేసుకున్నానని అంటోంది. సినిమాలో టార్చర్ అనుభవించిన, ఒత్తిడి ఫీలయ్యే కేరక్టర్ కావడంతోనే.. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.