తాప్సీ.. నెల రోజుల నుండి అక్కడే గోల

Update: 2016-08-05 09:30 GMT
రింగుల జుత్తు తాప్సీ ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తోంది. తాను చేస్తున్న పనిని దాచేసి.. తన లైఫ్‌ ఎంత తాపీగా ఉందో చెబుతూ పోతోంది మన బంగారం. ఇంతకీ అసలు సంగతేంటో చూద్దాం పదండి.

దాదాపు ఒక 20 రోజుల నుండి లండన్ లోనే ఉంటుంది తాప్సీ. అక్కడ తన 21వ సినిమా.. అదేలేండి కొత్త బాలీవుడ్ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే ఈ సినిమాను కేవలం లండన్ లోనే కాదు.. చుట్టుపక్కల నగరాలైన బర్మింగామ్‌ - బ్రిస్టల్.. అలాగే అందమైన టౌన్స్ అయినటువంటి కామెన్ తదితర ప్లేసుల్లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రతీ లొకేషన్ నుండీ తాప్సీ తన ఫోటోలు షేర్ చేస్తూ.. ఫుల్ ఖుషీ అయిపోతోంది తెలుసా. అంతేకాదు.. ఆ ఫోటోల్లో అమ్మడు హాట్ లుక్స్ చూస్తే.. మనం కూడా ఇంప్రెస్ అయిపోతాంలే. మరో 10 రోజులు అక్కడే షూటింగ్ చేసి.. ఏకంగా నెల రోజుల పాటు లండన్ ను నా సెకండ్ హోమ్ చేసుకున్నా అంటూ తాప్సీ గర్వంగా చెప్పుకోవాలని చూస్తోందట.

ఇకపోతే బాలీవుడ్ లో అమ్మడు నటించిన ''పింక్'' సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో 10 రోజుల్లో తన లండన్ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే.. ముంబయ్ వచ్చేసి ఈ పింక్ సినిమా ప్రమోషన్లలో తాప్సీ సందడి చేయనుంది. అది సంగతి.
Tags:    

Similar News