ఇంకో గిఫ్ట్ ఇచ్చుకున్న తాప్సీ

Update: 2017-10-10 11:01 GMT

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను రీసెంట్ గా తనకు తాను ఓ బహుమతి ఇచ్చేసుకుంది. ఎన్నేళ్లుగానో తను కొనాలని కలలు కంటున్న ఓ బీఎండబ్ల్యూ కారును సొంతం చేసుకుని.. దానితో ఫోటో దిగి అభిమానులతో పంచుకుంది. ఇప్పుడీ భామ మళ్లీ తనకు తను ఇంకో గిఫ్ట్ ఇచ్చుకుంది. ఈ ఏడాదంతా తాప్సీ తెగ బిజీగా గడిపేసింది. ఇంకా చెప్పాలంటే.. అమ్మడి కెరీర్ లోనే 2017 అత్యంత కీలకం. పైగా కెరీర్ బెస్ట్ స్టేజ్ లో కూడా వెలిగిపోతోంది.

ఈ ఏడాది ఇప్పటివరకూ తాప్సీ పన్ను 4 సినిమాలు రిలీజ్ చేసేయడం విశేషం. రన్నింగ్ షాదీ.. నామ్ షబానా.. జుడ్వా2 అంటూ మూడు హిందీ సినిమాలు.. ఆనందో బ్రహ్మ అంటూ ఓ తెలుగు చిత్రంలో నటించి మంచి హిట్స్ కూడా సాధించిన తాప్సీ.. ఇప్పుడు సూపర్బ్ వెకేషన్ రూపంలో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నానని చెప్పింది. ఇలాంటి వెకేషన్స్ లైఫ్ లో చాలా అవసరం అని కూడా తాప్సీ చెబుతోంది.

'లైఫ్ లో వెకేషన్స్ కూడా చాలా ముఖ్యమైన భాగం. అవి జీవితంలో రియాలిటీకి దగ్గరగా తీసుకెళతాయి. స్టాక్ హామ్ కు నేను వచ్చాను. కొన్నివారాల పాటు సుదీర్ఘమైన వర్క్.. రిలీజ్ ల తర్వాత కొత్త సినిమాకి ప్రిపరేషన్ కు ముందు వెకేషన్ కు వచ్చాను. ఇక్కడంతా తిరిగేసేయడం నా ఉద్దేశఅయం కాదు. సిటీ సెంటర్ లోనే ఉంటూ.. డిఫరెంట్ కూజిన్స్ లో సూపర్బ్ టైం స్పెండ్ చేస్తున్నాను. ఇలాంటి వెకేషన్స్ మళ్లీ లైఫ్ కు ఎనర్జీని అందిస్తాయి' అని చెప్పింది తాప్సీ.


Tags:    

Similar News