పింక్ మూవీతో బాలీవుడ్ కి తన ట్యాలెంట్ మళ్లీ చూపించబోతోంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో కలిసి నటించడంపై చాలా సంతోషం వ్యక్తం చేసిన ఈ భామ.. పింక్ లో తన నటనతో ఆడియన్స్ ను మెప్పిస్తానని కాన్ఫిడెంట్ గానే ఉంది.
సెప్టెంబర్ 16న పింక్ చిత్రాన్ని రిలీజ్ చేయనుండగా.. ఇప్పుడీ మూవీ ప్రమోషన్స్ కోసం బాగానే కష్టపడుతోంది తాప్సీ. ఒక్కో చోటా ఒక్కో రకమైన గెటప్ తో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పనిలో పనిగా ఫోటోషూట్స్ హంగామా కూడా ఫినిష్ చేసేస్తోంది. సోకులు.. సోయగాలను ఎగ్జిబిట్ చేయడంలో తాప్సీకి ట్యాలెంట్ చాలానే ఉంది కానీ.. ఈ మధ్య వరుసగా సక్సెస్ లను కూడా రుచి చూడ్డంతో.. అమ్మడి ఫేస్ లో ఆ కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు డ్రెసింగ్ లోనూ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఆకట్టుకుంటోంది. పింక్ మూవీ కాన్సెప్ట్ బేస్డ్ అయినా.. పబ్లిసిటీలో మాత్రం గ్లామర్ కాన్సెప్ట్ ఒకదాన్నే నమ్మేసింది తాప్సీ.
ఇక తెలుగులో అయితే.. ఈమెకు రానాతో చేస్తున్న ఘాజీ తప్ప వేరే సినిమా ఏదీ చేతిలో లేదు. ఆ స్థాయిలో తనను మెప్పించే స్టోరీ.. పాత్ర అయితేనే చేస్తానని.. లేకపోతే తెలుగు-తమిళ్-హిందీ ఏ భాషలో అయినా సరే సినిమాలు ఒప్పుకోనని తెగేసి చెబుతోంది తాప్సీ పన్ను.