బాలీవుడ్ లో స్పీడ్ చూపించబోతున్న తాప్సీ పన్ను సొంతూరు ఢిల్లీనే. ఇక్కడే పుట్టి పెరిగిన ఈమెకు.. పింక్ మూవీ కొత్త అనుభవాలను నేర్పింది. సాధారణంగా షూటింగ్ అంటే ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. కానీ పింక్ చిత్రం మొత్తం దాదాపుగా ఢిల్లీ పరిసరాల్లోనే షూటింగ్ చేసేశారు. దీంతో సొంతూరులోనే ఉంటూ సినిమా కంప్లీట్ చేసే ఛాన్స్ వచ్చింది. అసలే సొంతూరు.. అందుకే తనతో పాటు నటించిన ఆండ్రియా తారింగ్ - కీర్తి కుల్హరిలకు పార్ట్ టైమ్ గైడ్ గా మారిపోయానంటోంది తాప్సీ.
మెట్రో రైల్ ఎక్కి తిరగడం.. స్థానిక మార్కెట్లలో షాపింగ్ చేయడం లాంటివాటితో ఫుల్లుగా ఎంజాయ్ చేశామని చెప్పిన ఈ ఢిల్లీ భామ.. పనిలో పనిగా ఓ మంచి పని కూడా చేశానంటోంది. పింక్ షూటింగ్ పూర్తి చేసుకుని ఓ రోజు ఇంటికెళ్తుంటే..'ఓ అమ్మాయిని కొందరు అబ్బాయిలు ఏడిపిస్తున్నారు. డబుల్ మీనింగ్స్ తో ఇబ్బంది పెట్టడం.. వెకిలి చేష్టలు శబ్దాలతో టీజింగ్ చేస్తున్నారు. వెంటనే నేను వారి వంక చాలా సీరియస్ గా చూశాను. దాంతో వాళ్లు భయపడి వెళ్లిపోయారు. అప్పుడా అమ్మాయిని కార్లో ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపా' అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
ప్రతీ అమ్మాయికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని.. అలాంటి టైమ్ లో సిగ్గపడకుండా.. భయపడకుండా.. ధైర్యంగా ఎదిరించాలని అన్న ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను.. తానైతే తిరిగి కొట్టేస్తుందట కూడా.