ల‌వ్ సీక్రెట్‌ ను బ‌య‌ట‌పెట్టిన తాప్సీ

Update: 2017-03-28 11:37 GMT
సూటిగా మాట్లాడేసే హీరోయిన్లు త‌క్కువే.  వివాదాస్ప‌ద అంశాల్ని ప్ర‌స్తావించ‌టం.. త‌న‌కు ఎదురైన అవ‌మానాల్ని దాచుకోకుండా మీడియా ముందు ఓపెన్ అయ్యే వారు చాలా చాలా త‌క్కువే. తెలుగులో ఒక వెలుగు వెలిగి.. ఆపై హిందీకి వెళ్లి.. పెద్ద సక్సెస్ లేని వేళ‌.. పింక్ మూవీతో త‌న స‌త్తాను చూపించారు తాప్సీ.

త‌న త‌ప్పేం లేకున్నా.. ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న ఆమెను చూసిన‌ప్పుడు అయ్యో అనిపించాల్సిందే. అందం.. చ‌లాకీత‌నం.. గ్లామ‌ర్‌ను పండించే విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌ని ఆమెకు.. రెండు మూడు అప‌జ‌యాల‌తో ఆమెకు అవ‌కాశాలు రావ‌టం మానేశాయి. అంతేనా..

నీ బాడీ.. హీరోయిన్‌ కు ఉండాల్సిన విధంగా లేదంటూ ముఖం మీద చెప్పిసి అవ‌మానించిన ఉదంతాలెన్నో. త‌న‌కేమాత్రం సంబంధం లేకున్నా..  ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న తాప్సీ ఈ మ‌ధ్య‌న ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించింది. తాను ల‌వ్‌ లో ప‌డిన విష‌యాన్ని చెప్పేసింది.

అయితే.. తాను ఎవ‌రితో ల‌వ్‌లో ఉన్నాన‌న్న విష‌యాన్ని చెప్ప‌ని ఆమె.. తాను ప్రేమిస్తున్న వ్య‌క్తి గ‌ర్వించ‌ద‌గిన వ్య‌క్తిగా మాత్రం పేర్కొంది. ఇంత‌కీ తాప్సీ పొన్ను ప్రేమికుడు ఎవ‌ర‌న్న విష‌యాన్ని ఆమె చెప్ప‌కున్నా.. బాలీవుడ్ లో మాత్రం వివ‌రాల్ని చెప్పేస్తున్నారు. ఒలింపిక్స్ సిల్వ‌ర్ ప‌త‌క విజేత‌..డెన్మార్క్ బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు మాతియాస్ బోయ్ తో తాప్సీ పొన్ను రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల్ని మీడియాతో  పంచుకోవ‌టం ఇస్టం లేద‌ని.. ఆ వివ‌రాలు చెబితే.. ఆ విష‌యాల మీద‌నే ఎక్కువ‌గా చూపిస్తార‌ని.. అందుకే త‌న ప‌ర్స‌న‌ల్స్‌ను చెప్పుకోవ‌టం ఇష్టం లేద‌ని పేర్కొంది. అయినా.. తాప్సీ చెబితేనే తెలుసుకోవాలా ఏంటి? కాస్త ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తే.. అల్లుకుపోవ‌టం మీడియాకు చేత‌కాద‌ని అనుకుంటుందా ఏంటి తాప్సీ?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News