సీన్ సహజంగా ఉండాలంటే నటించకూడదు.. జీవించాలి. మారిన కాలానికి తగ్గట్లు గతంలో మాదిరి కాకుండా నటీనటులు ఎక్కువగా కష్టపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రిస్క్ లకు సైతం వెనుకాటం లేదు.తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది ప్రముఖ నటి తాప్సీ. పాత్ర ఏదైనా అందు లో ఇమిడి పోయేలా నటించే సత్తా ఉన్న ఆమె.. తాజాగా తప్పడ్ అనే బాలీవుడ్ మూవీ చేస్తున్నారు.
ఇందులో తాప్సీ భర్తగా పవైల్ గులాటి నటిస్తున్నారు. ఇటీవల ఈసినిమా ట్రైలర్ విడుదలై.. విశేష ప్రచారం లభించింది. చెంపదెబ్బ కొట్టాడని భర్తకు విడాకులు ఇచ్చేందుకు రెఢీ అయిన భార్య క్యారెక్టర్ ను తాప్సీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు తాప్సీ. సినిమాకు చెంపదెబ్బ కొట్టే సీన్ కు అధిక ప్రాధాన్యత ఉండటంతో.. దాన్ని సహజంగా చేయాలని డిసైడ్ అయ్యారు.
ఈ సీన్ ఎంత సహజంగా వస్తే.. అంత బాగుంటుందని.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సహజంగా ఫీల్ కావాలంటే చెంపదెబ్బ సీన్ నేచురల్ గా ఉండాలని.. అందుకే ఆ షాట్ కోసం రెండు రోజులు సమయం తీసుకొని హీరో పవైల్ సిద్ధమయ్యాడని చెప్పింది తాప్సీ. తనను చెంపదెబ్బ కొట్టేందుకు చాలా భయపడటంతో పాటు.. ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని.. ముందు తనను కొట్టాలని కోరేవాడన్నాడు. ముందు తనను కొడితే భయం పోయి తాను కొట్టగలనని చెప్పినట్లు చెప్పింది తాప్సీ.
అయినప్పటికీ షాట్ సరిగా రాలేదని.. కొన్నిసార్లు చెంప మీద కొట్టబోయి మెడ మీదా.. చెవి మీదా కొట్టేవాడని.. దీంతో.. ఏడుసార్లు ఈ షాట్ ఓకే కావటం కోసం చెంప దెబ్బలు తినాల్సి వచ్చిందని తాప్సీ పేర్కొంది. అదే పనిగా షాట్ మీద షాట్ అవుతున్నా.. ఓకే కాక పోవటంతో.. నా గురించి ఆలోచించటం మానేయ్.. గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టు చాలని తాను చెప్పినట్లుగా పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన వార్తలన్ని చెంపదెబ్బ చుట్టూ తిరుగుతున్న వేళ.. అసలీ సినిమా లో చెంప దెబ్బ సీన్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ఇప్పుడు మరింత ఎక్కువ అవుతుందని చెప్పాలి.