ఘాజీ కోసం బెంగాలీ నేర్చుకుందట

Update: 2017-02-09 05:33 GMT
తాప్సీ పన్ను యాక్టింగ్ విషయంలో బాగా పర్ఫెక్షనిజం చూపించేస్తోంది. ‍ఒక్క సినిమాలో నటించేందుకు ఒక భాష నేర్చుకోవడం అంటే నిజంగా పెద్ద విషయమే. ఈ నెల 17న థియేటర్లలోకి వస్తున్న ఘాజీ మూవీలో తాప్సీ పన్ను కీలక పాత్ర పోషించింది.

బంగ్లాదేశ్ శరణార్ధిగా తాప్సీ కనిపించనుంది. అందుకే ఈ పాత్ర కోసం బెంగాలీ భాష నేర్చేసుకుందట ఈ బ్యూటీ. కేరక్టర్ ను మరింత అర్ధం చేసుకోవాలంటే భాష నేర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అయిన తాప్సీ.. ఓ ట్యూటర్ ను కూడా ఏర్పాటు చేసుకుని భాషపై పట్టు పెంచుకుందట. భాషతో పాటు యాస విషయంలోనూ ఏ మాత్రం తేడా రాకుండా పలకడం బాగా ప్రాక్టీస్ చేసిందని తెలుస్తోంది. అదృష్టం కొద్దీ ఈ మూవీ యూనిట్ లో కూడా ఒక బెంగాలీ వ్యక్తి ఉండడంతో.. వీలైనంతవరకూ ఆ భాషలోనే మాట్లాడిందట తాప్సీ. షూటింగ్ జరిగినన్నాళ్లు ఈ వ్యవహారం కొనసాగిన తీరు చూసి.. కొత్త భాష నేర్చుకోవడం అంటే తాప్సీకి ఎంత ఇష్టమో అనుకుంటున్నారు.

కొత్త భాష అంటే చాలు.. తాప్సీ తెగ ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటుంది. గతంలో తెలుగు.. తమిళ్ సినిమాలు చేస్తే.. వాటికోసం తెలుగు నేర్చుకోవడమే కాదు.. ఏకంగా డబ్బింగ్ కూడా చెప్పేసుకుంది ఢిల్లీ బేస్డ్ పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News