ట్విట్టర్ లో తిట్టిపోసిన తాప్సీ

Update: 2018-05-30 17:16 GMT
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్నుకు కాస్త నోటి దురుసు ఎక్కువే అని రీసెంట్ టైంలో జనాలకు బాగానే అర్ధమైంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి కొంతకాలం క్రితం వరకూ సైలెంట్ గానే ఉండేది కానీ.. ఈ మధ్యన అమ్మడు బాగానే నోరు చేసుకుంటోంది. కారణం దొరికితే చాలు.. చెడామడా వాయించేందుకు ఏ మాత్రం సందేహించడం లేదు.

రీసెంట్ గా తాప్సీపై ఓ నేషనల్ డైలీలో వార్త వచ్చింది. నవాజుద్దీన్ సిద్దిఖీతో చేసేందుకు తాప్సీ నో చెప్పింది అని ఆ న్యూస్ సారాంశం. అయితే.. ఆ ఆర్టికల్ ఫోటోను ట్విట్టర్ లో పెట్టిన తాప్సీ.. బాధ్యతా రాహిత్యంతో కూడిన జర్నలిజం అంటూ గట్టిగానే పంచ్ డైలాగులు పేల్చింది. నవాజుద్దీన్ తో చేయడం ఇష్టం లేదంటూ రాసిన కారణం.. తన ఉద్దేశ్యమా.. లేక హెడ్ లైన్స్ కు అవసరం అయ్యి తనపై రుద్దుతున్నారా అని నిలదీసింది తాప్సీ పన్ను. దీనికి ఆ జర్నలిస్ట్ ఏమీ తగ్గలేదు. బాధ్యత లేదని ఆరోపించే బదులు.. మీకు సంబంధించిన వ్యక్తులు ఇలా లీకులు ఇవ్వకుండా చూసుకోవాలని అన్నాడు. ఇలాంటివి పబ్లిష్ చేసే ముందు కనీసం సాక్ష్యం ఉండాలని చెప్పుకొచ్చింది తాప్సీ.

ఈసారి తాప్సీకి సంబంధించిన ఏ వార్త అయినా.. కన్ఫాం చేసుకున్నాకే రాస్తానని ఆ పాత్రికేయుడు చెబితే.. తనకు ఎప్పుడు సంజాయిషీ ఇచ్చే అవసరం రాకుండా చూసుకుంటానని అనింది తాప్సీ. మొత్తం మీద ఈ వెర్బల్ వార్ ఇక్కడితో ముగిసిపోయింది కానీ.. రూమర్స్ పై ఈ రేంజ్ లో రియాక్షన్స్ రిప్లైస్ మాత్రం కొత్తగానే ఉన్నాయి.
Tags:    

Similar News