సింపుల్ కౌంటరేసిన డింపుల్ బ్యూటీ!

Update: 2018-07-27 08:42 GMT
డింపుల్ బుగ్గల బ్యూటీ తాప్సీ పన్నుకు కాస్త చలాకీగా మాట్లాడే అలవాటుంది. తెలుగు, తమిళంలో కాస్త పాపులారిటీ సాధించి ఈమధ్య బాలీవుడ్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టిన తాప్సీ అలాగే చలాకీగా - చమత్కారంగా ఈమధ్య తన మీద వచ్చే రూమర్లకు సింపుల్ కౌంటర్ ఇచ్చింది. 

ఈమధ్య బాలీవుడ్ మీడియాలో తాప్సీ ఎంగేజ్మెంట్ గురించి వార్తలు గుప్పుమన్నాయి.  తాప్సీ ఎప్పట్నుంచో తన బాయ్ ఫ్రెండ్, బాడ్మింటన్ ప్లేయర్ అయిన మతియాస్ బొ తో రిలేషన్ లో ఉందని గాసిప్పులు వినిపిస్తున్నాయి.  కానీ ఈ సొట్టబుగ్గల సుందరి ఎప్పుడూ దాన్ని ఒప్పుకోలేదనుకోండి.. అది వేరే విషయం.   ఆ మతియాస్ బోతో ఈమధ్యనే గోవా లో సీక్రెట్ గా నిశ్చితార్థం అయిందని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతుందని ముంబై మీడియాలో తెగ హంగామా జరిగింది.  ఎంగేజ్మెంట్ కు తాప్సీ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారని కూడా వార్తలు వచ్చాయి.

దీనిపై స్పందిస్తూ తన ఎంగేజ్మెంట్ ఓ పదేళ్ళ క్రితం అయి ఉండొచ్చని.. ఎందుకంటే తన పేరెంట్స్ పదేళ్ళ క్రితం గోవా కు వెళ్ళారని చెప్పుకొచ్చింది... అంతే కాదు తన ఎంగేజ్మెంట్ కు తనకు కూడా ఇన్విటేషన్ రాలేదేంటా.. అదెట్టా.. అదెట్టా అని హిందీలో అడిగింది.  డింపుల్ బ్యూటీ అలా విసిరిన సింపుల్ సెటైర్ మీకు అర్థం అయిందనుకుంటా..!

మరోవైపు, తాప్సీ తాజా చిత్రం 'ముల్క్' త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  తెలుగు సినిమా 'నీవెవరో' కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  ఇవి  కాకుండా 'తడ్కా'.. 'మన్మర్జియాన్'.. 'బద్లా' మరో మూడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.
Tags:    

Similar News