మ్యక్సిమమ్‌ అందాలతో హోరెత్తిస్తోంది

Update: 2016-01-06 09:30 GMT
టాలీవుడ్ లో సెటిల్ అవడానికి చాలానే ప్రయత్నాలు చేసింది తాప్సీ పన్ను. అవకాశాలయితే లెక్కకి మించి వచ్చాయి కానీ.. ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు. స్టార్ హీరోల సరసన ఆఫర్లు దక్కించుకున్నా.. అవేవీ కెరీర్ కి ఉపయోగపడలేదు. దీంతో కోలీవుడ్ కి మకాం మార్చిన తాప్సీ.. రీసెంట్ గా గంగతో బ్లాక్ బస్టర్ అందుకుంది. దక్షిణాది మొత్తం ఈ భామ పేరు మార్మోగిపోయింది.

ఆ తర్వాత నార్త్ నుంచి కూడా ఆఫర్స్ పలకరిస్తుండడంతో.. బాలీవుడ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది తాప్సీ. గతంలోనూ ఒకటీ అరా హిందీ మూవీస్ చేసినా ఈమెకు గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తాప్సీ నటించిన రన్నింగ్ షాదీ.కాం విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆగ్రా కా డాబ్రా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదే టైంలో తన కెరీర్ ని ఫుల్ స్వింగ్ లో పరుగులు పెట్టించడానికి.. ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయాలని డిసైడైంది తాప్సీ. అందుకోసం రీసెంట్ గా మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం ఓ స్పెషల్ ఫోటోషూట్ లో కూడా పాల్గొని, కవర్ పేజ్ ఎక్కేసింది. బ్లాక్ డిజైనర్ వేర్, జీన్స్ షార్ట్స్ తో తాప్సీ మతి పోగొట్టేస్తోంది.

నాభి నుంచి పైవరకూ క్లీవేజ్ షో చేస్తూ.. ఎక్స్ పోజింగ్ కం సెక్స్ పోజింగ్ లో తనకు హద్దులు లేవని చెప్పకనే చెప్పిందీ చిన్నది. ఇలాంటి ఆరబోతకు అడుగడుగునా అవకాశం ఉండే బాలీవుడ్ లో.. సరైన అవకాశం ఒక్కటి దక్కించుకునేందుకు తాప్సీ పన్ను గట్టి ప్రయత్నాలే చేస్తోందని టాక్. ప్రస్తుతం నటిస్తున్న మూవీస్ లో ఏ ఒక్కటి హిట్ అయినా.. తాప్సీ బాలీవుడ్ డ్రీమ్స్ నిజమయ్యే ఛాన్సులు ఉన్నట్లే.
Tags:    

Similar News