బాలీవుడ్ కి వెళ్లిన తాప్సీ పన్ను.. అక్కడ కెరియర్ ను బాగానే డిజైన్ చేసుకుంటోంది. తన గురించి జనాలు పలు మార్లు మాట్లాడుకునే ఎలాంటి సందర్భాన్ని అయినా ఈ భామ వదులుకోవడం లేదు. నెపోటిజం నుంచి ఫెమినిజం వరకు.. సౌత్ సినిమాల నుంచి గ్లామర్ షో వరకూ అన్నిటిపైనా సందర్భం దొరికినపుడల్లా తెగ కబుర్లు దంచేస్తోంది.
ప్రస్తుతం సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రాలింగ్ బాగా పెరిగిపోయిన మాట ఒప్పుకోవాల్సిందే. దీన్ని ఇప్పుడు సీరియస్ గా టేకప్ చేసింది ఎంటీవీ. ట్రాల్ పోలీస్ పేరుతో సిరీస్ నిర్వహిస్తున్న ఈ ఛానల్.. ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ ప్రారంభించబోతోంది. ఓ టీంను ఏర్పాటు చేసుకుని.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లను నియమించి.. ఇలా ట్రాలింగ్ కు పాల్పడుతున్న వారు ఎవరో గుర్తించి.. ఇలా ట్రాలింగ్ చేయడం సైబర్ నేరం కిందకు వస్తుందని జనాల్లో అవగాహన కల్పించడం.. ఈ ప్రోగ్రాం అల్టిమేట్ టార్గెట్. రణ్ విజయ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనుండగా.. తొలి గెస్ట్ గా తాప్సీ పన్ను రానుండడం విశేషం.
సోషల్ మీడియా అంటే బాధ్యత అని.. తమ చేతిలో ఉండే పవర్ అని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారని.. దీన్ని సరిగా ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాన్ని సవివరంగా తెలియచేసేలా ట్రాల్ పోలీస్ ను డిజైన్ చేశారట. మరి ఈ కార్యక్రమంలో తాప్సీ పన్ను ఎలాంటి కామెంట్స్ చేయనుందో.. ట్రాలింగ్ పై ఎలా రియాక్ట్ కానుందనే అంశం ఆసక్తికరమే.