పవన్ తరువాత అక్కడ ఆమె స్పీచ్

Update: 2018-02-09 06:04 GMT
సినిమా రంగంలో విజయం సాధించాలంటే సాధారణమైన విషయం కాదు. గెలుపోటములను సమానంగా తట్టుకోవాలంటే చాలా పట్టుదల ఉండాలి. ముఖ్యంగా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని సమర్ధవంతంగా కెరీర్ ను నడిపించడానికి ఎంతో దైర్యం ఉండాలి. అలాంటి వారికి జీవితంపై ఒక అవగాహనా సమాజం గురించి ఆలోచించాలనే పట్టుదల బాగానే ఉంటుంది. వారి అనుభవాలని ఇతరులతో పంచుకుంటే బావి తరాలకు ఆదర్శంగా ఉంటుంది.

అయితే అలాంటి వారితో ప్రతి ఏడాది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మరియు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ విద్యార్థులచే నిర్వహించబడే ఇండియన్ కాన్ఫరెన్స్ కి ముఖ్య అథిదులుగా ఆహ్వానించి వారి గురించి విద్యార్థులు తెలుసుకుంటారు. గత ఏడాది సినీ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు పవన్ ప్రసంగం చాలా మందిని ఆకర్షించింది. ఇక ఈ సారి 15 వ ఎడిషన్లో కెనెడి విశ్వవిద్యాలయంలో జరిగే ఇన్నోవేషన్లో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించబోయే వారిలో తాప్సి కూడా చేరింది.

సమాజంలో ఉన్న సమస్యలపై తాప్సి చాలా సార్లు ప్రశ్నించే ప్రయత్నం చేసింది. అంతే కాకుండా పరిస్థితులను అర్ధం చేసుకొని మనకిష్టమైన రంగంలో ఎలా ముందుకు సాగాలి అనే విషయంపై ఆవాహన ఏర్పరచుకుంది. ఆ విధంగానే నటనలో తనను తాను నేర్పించుకొని బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటోంది. ఆక ఇప్పుడు తాప్సి హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.


Tags:    

Similar News