ఝుమ్మంది నాదం సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సి పన్ను. తెలుగులో ఆపైన పెద్దగా అవకాశాలు రాని కారణంగా ఆమె బాలీవుడ్ కు మకాం మార్చింది. పింక్ సినిమా హిట్ అవడం తో పైగా అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద నటుడితో నటించడంతో ఆమె స్టార్ అయిపోయింది. అందరూ ఆమె దశ తిరిగిపోయింది ఇక ఈమెకు ఎదురులేదు అనుకున్నారు. అలానే జుద్వా 2 లో కూడా అవకాశం పొంది పుచ్చుకుంది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అక్కడ కూడా ఈమెకి అవకాశాలు తగ్గిపోయాయి.
అంతకు ముందు తెలుగులో నాకు సరిపడే పాత్రలు ఇవ్వటం లేదని కొన్ని ఘాటు కామెంట్లు చేసిన ఈమె ఇపుడు మళ్ళీ తన మాటలతో వార్తల్లోకి ఎక్కింది. తెలుగు సినిమాలు చేయకపోవడానికి గల కారణం అడగగా - హీరోలని ఎక్కువగా నన్ను తక్కువగా చూడటం నాకు నచ్చలేదు అంటూ ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడిన తాప్సీ చెప్పుకొచ్చింది. "ఓ సినిమాలో ఇంట్రడక్షన్ పార్ట్ నాకు తెలీకుండా మార్చేశారు. ఆ విషయం నాకు షూటింగ్ సెట్స్ లోకి వచ్చేవరకు చెప్పనే లేదు. ఎందుకు అని అడిగితే డైరెక్టర్ హీరో మార్చమన్నారు. తన పాత్ర కంటే హీరోయిన్ పాత్రకు ఎక్కువ హైలైట్ అవుతుండడంతో ఆ ఇంట్రో సీన్ మార్చారు అన్నారు. ఎందుకు చెప్పలేదు అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ అవమానపరిచేలా మాట్లాడారు. అందుకే సమాన గౌరవం ఉండే పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పింది.
నాకోసం మాత్రమే సంవత్సరం ఆగారు కాబట్టి ఆనందో బ్రహ్మ చేసాను. కోటి రూపాయలు తీసుకున్నాను. ఇకపై కూడా నాకోసం ఎదురుచూసే సినిమాలు నాకు గౌరవం తెచ్చే సినిమాలు మాత్రమే చేస్తాను. " అని ఖరాఖండిగా చెప్పింది తాప్సి. ఇంతకు ముందు కూడా హీరోయిన్లను ఐరెన్ లెగ్స్ అనకూడదు అని. కావాలని రెమ్యూనరేషన్ కూడా తగ్గించకూడదు, హీరో లకి హీరోయిన్లకు కూడా ఒకేలా రెమ్యునరేషన్ ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చింది ఈ 'మిస్టర్ పర్ఫెక్ట్' చిన్నది.