ఆ రాత్రుల్లో తాప్సీకి నిద్ర ఉండదట!!

Update: 2016-07-05 17:30 GMT
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను రేంజ్ ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఈ స్టేజ్ కి చేరుకోవడానికి తాప్సీ చాలానే కష్టాలే పడింది. హీరోయిన్ గా గుర్తింపు లభించినా.. మొదట ఐరన్ లెగ్ ముద్ర వేశారు. దాన్నుంచి బయటపడి.. హిట్ కొట్టి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అనిపించుకునే స్థాయికి ఎదగడానికి తాప్సీకి చాలా కాలమే పట్టింది. అయితే పట్టుదలతో అన్ని అవరోధాలను అధిరోహించిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ స్పీడ్ చూపిస్తోంది.

'సినిమా రంగంలో ఏ భాషలో అయినా ఒక్క తప్పు చేస్తే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. బాలీవుడ్ లో అయితో పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. స్క్రిప్ట్ దశలోనే ఏ మాత్రం అనుమానం వచ్చినా.. ఆ సినిమాలో నటించనని తేల్చి చెప్పేస్తాను. ఆఫర్లు ఎన్ని వచ్చినా.. మంచి సినిమా సెలక్ట్ చేసుకునేందుకు టైమ్ తీసుకోవాలి. స్కూల్ లో చదివేటపుడు ప్రోగ్రెస్ కార్డ్ కోసం ఎదురు చూస్తాం. అలాగే నేను నటించిన సినిమా విడుదలైనపుడు.. దాని సక్సెస్ కోసం ముందునుంచి కొన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటా' అని చెప్పింది తాప్సీ పన్ను.

ప్రస్తుతం బిగ్ బీ అమితాబ్ తో కలిసి తాప్సీ నటించిన మూవీ పింక్.. విడుదలకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ పాఠాలన్నీ అమితాబ్ దగ్గర నేర్చుకుందో.. తను చేసిన తప్పుల నుంచి నేర్చుకుందో మాత్రం తాప్సీ చెప్పలేదు. అయినా.. ఇంతలేసి క్లాసులు పీకగలిగే ట్యాలెంట్ ఉన్నపుడు.. ముందు నుంచి అన్ని ఫ్లాప్స్ ఎందుకు కొట్టిందో కూడా తాప్సీ పన్ను క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది కదూ!
Tags:    

Similar News