మేకప్ లేకున్నా మైమరపిస్తోంది

Update: 2018-02-15 10:02 GMT
ఝుమ్మంది నాదం తో ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను తెలుగు ప్రేక్షకులను తన అందంతో ముగ్ధులను చేసింది. ఎపుడో అరా కోర సినిమాలు తప్ప తెలుగు లో ఈమె సినిమాలు చేయడం ఆపేసింది. ఎపుడో ఆనందోబ్రహ్మ అనే హార్రర్ కామెడీ లో చేసింది కానీ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. అలా అని తన కెరీర్ బాలేదు అనుకోకండి. ఎందుకంతే తాప్సి ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీ హీరోయిన్ అయిపోయింది.

షూటింగ్స్ తో బిజీ గా ఉన్న ఫాన్స్ కోసం సోషల్ మీడియా లో యక్టీవ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ 'పింక్' బ్యూటీ. ఈమధ్యనే అమృత్ సర్ వెళ్లి కెమెరా కు చిక్కింది. తన ఫోటో తానే షేర్ చేస్తూ 'ఫిల్టర్ లేదు - మేకప్ లేదు - స్ట్రెస్ లేదు.. మన్మర్జియాన్ మోడ్ అంటూ చెప్పుకొచ్చింది. మన్మర్జియాన్ అనేది త్వరలో రాబోతున్న సినిమా పేరు. షూటింగ్ ముందు దేవుడి దర్శనం కోసం వెళ్లి తన ఫోటో ను షేర్ చేస్తే - ఈమె అందం అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందమైన ముఖంతో - పక్కకు తిరిగి చూస్తున్న తాప్సి - దుపట్టాను తలపై చుట్టుకుని చాలా క్యూట్ గా చూస్తోందిలే.

అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న మన్మర్జియాన్ సినిమాలో అభిషేక్ బచ్చన్ పక్కన హీరోయిన్ గా కనిపించబోతోంది తాప్సి. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ సినిమాలు రొటీన్ వాటికి భిన్నంగా ఉంటాయి. బ్లాక్ ఫ్రైడే - గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ - బొంబాయి వెల్వెట్ లాంటి క్రైమ్ స్టోరీలు తీసిన అనురాగ్ కశ్యప్ సొట్టబుగ్గల సుందరి తాప్సి తో ఎలాంటి సినిమా తీస్తాడా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News