దక్షిణాదిన మూణ్నాలుగేళ్ల పాటు వరుస బెట్టి సినిమాలు చేసి.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది తాప్సి పన్ను. అక్కడ మంచి మంచి పాత్రలతో నటిగా గొప్ప పేరే సంపాదించింది. కానీ అక్కడామెకు వచ్చిన పేరుకు తగ్గట్లుగా పారితోషకాలు ఇవ్వట్లేదట. చాలా సినిమాలకు నామమాత్రపు పారితోషకంతో సరిపెడుతున్నాడట. దేశవ్యాప్తంగా విడుదలయ్యే హిందీ సినిమాలతో పోలిస్తే దక్షిణాదిన ఒకట్రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యే సినిమాలకే ఎక్కువ పారితోషకం ఇస్తున్నారట. ఓవైపు హీరోలకు పదుల కోట్లలో రెమ్యూనరేషన్లు ఇస్తూ హీరోయిన్ల విషయంలో మాత్రం ఈ వివక్ష ఏంటి.. హీరోలతో సమానంగా కాకపోయినా తమ స్థాయిలో సరైన పారితోషకం ఇవ్వాల్సిందే కదా అని ఆమె గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం.
చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలో నటించింది తాప్సి. ఆ సినిమాకు లాభాల్లో వాటా కింద తనకు కోటి రూపాయలు దక్కినట్లు తాప్సి ఇంతకుముందే ఒకసారి వెల్లడించింది. దాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. బాలీవుడ్ వాళ్లను పారితోషకం విషయంలో నిలదీస్తోందట. బాలీవుడ్లో ఇంకా కోటి రూపాయల మార్కును ఆమె అందుకోలేదట. వరుసగా విజయాలు దక్కుతున్నా.. నటిగా మంచి పేరొస్తున్నా పారితోషకం విషయంలో మాత్రం తనకు అన్యాయమే జరుగుతోందని ఆవేదన చెందుతున్న తాప్సి.. తన కొత్త సినిమాకు మాత్రం రెమ్యూనరేషన్ పెంచాల్సిందే అని నిర్మాతల దగ్గర తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రిషి కపూర్‌తో కలిసి ‘ముల్క్’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ‘పింక్’ తర్వాత అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తోంది తాప్సి.