పెన్నుతోనూ సత్తా చాటుతానంటున్న తాప్సీ

Update: 2016-06-25 05:06 GMT
ఆన్ స్క్రీన్ పైనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లోనూ ట్యాలెంట్ చూపించే అందాల భామల సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రియాంక చోప్రా లాంటి వాళ్లు ప్రొడక్షన్ పై దృష్టి పెడితే.. కొందరు గొంతు సవరించుకుంటున్నారు. రీసెంట్ గా సోనమ్ కపూర్ పుస్తకాలపై రివ్యూలు రాస్తానని చెప్పిన విషయం తెలిసిందే. కొందరు సీనియర్ సుందరాంగులు డైరెక్షన్ ను హ్యాండిల్ చేసిన సందర్భాలను ఇప్పటికి చాలానే చూశాం. ఇక సినిమాలకు సంబంధం లేకుండా ట్యాలెంట్ చూపించే వాళ్ల సంఖ్య చాలానే ఉంటుంది.

కానీ మూవీ ఫీల్డ్ లో అత్యంత అరుదుగా ఎంచుకునే ప్రొఫెషన్ రైటింగ్. కథ - మాటలు రాసే విషయంలో చాలామంది సాహసం చేయరు. సినిమాకి అత్యంత కీలకమైన ఈ విభాగంలో తలదూర్చే సాహసం హీరోయిన్లు చేసిన సందర్భాలు.. బహుశా ఉండవు. కానీ ఢిల్లీ బ్యూటీ తాప్సీ మాత్రం.. పెన్నుతో సత్తా చాటుతానంటోంది. ముందుగా తన పాత్రకి మాటలు రాసుకుని.. ఈ కొత్త రోల్ ని స్టార్ట్ చేస్తోందని తెలుస్తోంది.

విభిన్న నటుడు ప్రకాష్ రాజ్ బాలీవుడ్ లో తడ్కాను తెరకెక్కిస్తున్నాడు. ఉలవచారు బిర్యాని మూవీని హిందీలో తడ్కా పేరుతో తీస్తుండగా.. ఇందులో తాప్సీ నటిస్తోంది. ఈ మూవీలో తన పాత్రకు తనే మాటలు రాసుకుంటోంది. మాటల్లా కాకుండా ఇవి తూటాల్లా ఉంటాయట. ఆ రేంజ్ లో ట్యాలెంట్ ని చూపిస్తానని తాప్సీ ధీమాగానే చెబుతోంది.
Tags:    

Similar News