లోకులు పలు కాకులన్న సామెతకు తగ్గట్లు ఉంది సోషల్ మీడియాలో కొందరి తీరు. చేతిలో ఫోను.. అందులో డేటా.. వాటితో పాటు సోషల్ మీడియా అకౌంట్లు. ఇంకేముంది? ఎవరికి తోచింది వారు అనేస్తున్నారు. గతంలో నలుగురు కలిస్తే వాళ్లును వీళ్లను ఒక మాట అనుకోవటం.. ఆత్మసంతృప్తి పర్చుకోవటం ఉండేది. ఇప్పుడా అవసరం లేకుండా నిత్యం లోకంతో కాంట్రాక్ట్.. అనుక్షణం ఎదో ఒక అప్డేట్.. దాన్ని చూసినంతనే కోతి లాంటి మనసులోని వికారాల్ని సంతృప్తి పర్చుకునేందుకు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసేయటం.
అదేమంటే.. సోషల్ స్వేచ్ఛ అంటూ చెత్త మాటలు మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువైంది. ఒక సోషల్ కాజ్ మీదనో.. కొందరు శ్రుతిమించి వ్యవహరించే సెలబ్రిటీల మీద విమర్శలు చేయటం తప్పేం కాదు. అందుకు భిన్నంగా బాధ్యతారాహిత్యంతో.. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసే తీరు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
పర్సనల్ మేటర్స్ ను పబ్లిక్ లోకి తీసుకొచ్చి చావు తిట్లు తినేసే బ్యాచ్ ను పక్కన పెడితే.. తమ మనసులోని ఫీలింగ్స్ ను చెప్పే క్రమంలో పోస్ట్ చేసిన సాదాసీదా ఫోటోల్ని దారుణమైన వ్యాఖ్యలు చేసే సోషల్ ఆకతాయిల తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా ఇలాంటిదే ఒక ఉదంతం చోటు చేసుకుంది. బాలీవుడ్ హీరో అయుష్మాన్ ఖురానా భార్య కమ్ దర్శకురాలు తహీరా కశ్యప్ ను తాజాగా నెటిజన్లు కొందరు నోరు పారేసుకున్న తీరు చూస్తే.. అయ్యో అనిపించక మానదు. భర్తతో కలిసి తాను దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కొందరు స్పందిస్తూ అతడు మీకు భర్తలా కాదు.. తమ్ముడిలా ఉన్నారంటే.. మరికొందరు అసలు మీరు ఎలా ఉన్నారో చూసుకున్నారా? మీరు ఆడో.. మగా అనే విషయం కూడా అర్థం కావటం లేదంటూ మితిమీరిన ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
సోషల్ కాకులు ఇష్టారాజ్యంగా మాట్లాడినా తహీరా మాత్రం బ్యాలెన్స్ మిస్ కాలేదు. హుందాగా రియాక్ట్ అవుతూ.. ఇలాంటి భాయ్ జోకులు వినీవినీ ఆయుష్మాన్ కలిసిన ప్రతిసారి బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాట వినిపిస్తోంది. అదేమిటో తెలుసా? తూ మేరా.. తూ మేరా భాయ్ నహీ హై అని. కొంతమంది ఏదో అన్నారని తాను అనటం లేదని.. తాను చెప్పాలనుకున్నది చెప్పానని చెప్పేశారు.
కేవలం లుక్ కారణంగా తమ మధ్యనున్న బంధం సోషల్ కాకులు అనుకున్నట్లుగా మారిపోదు కదా? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడుతున్న తహీరా ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్నారు. ఇంతటి అనారోగ్యంలోనూ భర్త..పిల్లలు.. కుటుంబానికి ఆమె ప్రదర్శిస్తున్న శ్రద్ధను మెచ్చుకోవాల్సింది పోయి.. ఆమె లుక్స్ గురించి.. భర్త ముందు ఆమె ఎలా ఉందన్న అతి మాటలు అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి మాటలతో నోరు పారేసుకునే వారంతా తమ ఇంట్లో వారితోనూ.. తమ ఆత్మీయుల విషయంలోనూ ఇంతేలా నోరు పారేసుకోగలరా?