#RRR : నీరు.. నిప్పు కాన్సెప్ట్‌ పై జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Update: 2020-04-16 07:30 GMT
రాజమౌళి ఏం చేసినా అద్బుతమే అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఒక వండర్‌ అన్నట్లుగానే ఉంటుంది. బాహుబలి చిత్రంతో ఆల్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ గా మారిపోయిన రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌ రామ్‌ చరణ్‌ లతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా ఆరంభం సమయంలోనే నీరు.. నిప్పు కాన్సెప్ట్‌ ను జక్కన్న ప్రమోషన్‌ పోస్టర్‌ లో చూపించిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ ను నీరుగా.. చరణ్‌ ను నిప్పుగా చూపిస్తూ పబ్లిసిటీ పోస్టర్స్‌ ను విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మోషన్‌ పోస్టర్‌ లోనూ అదే థీమ్‌ ను చూపించారు. సినిమాకు దీనికి సంబంధం ఏంటీ అనే విషయంపై క్లారిటీ లేదు. కాని తాజాగా రాజమౌళి ఈ విషయమై ఆసక్తికర కామెంట్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా చేశాడు.

రాజమౌళి స్పందిస్తూ... నీరు నిప్పు అనేది పూర్తి విరుద్దమైన ఎలిమెంట్స్‌. ఈ రెండు కూడా ఒకదాన్ని మరోటి నాశనం చేస్తాయి. కాని ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఆవిరి ఏర్పడి శక్తిగా మారి ప్రపంచం అనే మోటర్‌ ను నడుపుతుంది అన్నాడు. పూర్తి విరుద్దమైన వీరిద్దరు కలిసి ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడ్డారు అనేది కథాంశం అయ్యి ఉంటుందని ఈ కాన్సెప్ట్‌ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

జక్కన్న ఏం చెప్పినా.. ఏం చేసినా చాలా కన్విన్సింగ్‌ గా ఉంటుంది. కనుక సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఈ కాన్సెప్ట్‌ అర్థం అవుతుందని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News